Begin typing your search above and press return to search.

మృణాల్.. ఎంత తెలివిగా ఆలోచిస్తోందంటే..

ఇలాంటి హీరోయిన్స్ స్టార్స్ గా ఎదగలేరు. కాని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నార్త్ నుంచి సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ రెండో రకంలోకి వస్తోంది.

By:  Tupaki Desk   |   10 Dec 2023 4:30 PM GMT
మృణాల్.. ఎంత తెలివిగా ఆలోచిస్తోందంటే..
X

చాలా మంది అందాల భామలు కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలని కలలు కంటూ ఉంటారు. కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ వస్తే స్టార్ స్టేటస్ తో పాటు అత్యధిక రెమ్యునరేషన్ కూడా అందుకోవచ్చు. అలాగే స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు శ్రీలీల అలాగే టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.

అయితే కొంతమంది తారలు మాత్రం కమర్షియల్ సినిమాలు కంటే నటిగా తన ఐడెంటిటీ చూపించుకునే కథలతోనే ప్రయాణం చేస్తారు. కథ నచ్చితే హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా మూవీ చేయడానికి ఒప్పుకుంటారు. ఇలాంటి హీరోయిన్స్ స్టార్స్ గా ఎదగలేరు. కాని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నార్త్ నుంచి సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ రెండో రకంలోకి వస్తోంది.

బయట హాట్ హాట్ డ్రెస్సులు బికినీ షూట్ లతో అందాల ప్రదర్శన చేసే మృణాల్ ఠాకూర్ తన సినిమాల విషయంలో మాత్రం గ్లామర్ పాత్రలు కాకుండా కచ్చితంగా కథలో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్స్ చేయడానికి ఇష్టపడుతుంది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కెరియర్ తో పాటు గ్లామర్ బ్యూటీ ఇమేజ్ ఉంది. దీంతో తెలుగులో గ్లామర్ బ్యూటీ ఇమేజ్ కి దూరంగా ఉండాలని అనుకుంటుంది.

అందుకే సీతారామం తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టి ఆచితూచి అడుగులు వేస్తూ హాయ్ నాన్న సినిమాలో నానికి జోడీగా కనిపించింది. ఈ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ పాత్ర అద్భుతంగా ఉండటంతో పాటు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. నటనకి స్కోప్ ఉన్న పాత్రలోనే తెలుగు ఆడియన్స్ ని మృణాల్ ఠాకూర్ మెప్పించింది.

విజయ్ దేవరకొండకి జోడీగా ఫ్యామిలీ స్టార్ మూవీలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్ బట్టి మృణాల్ ఠాకూర్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉన్నట్లే కనిపిస్తోంది. పరశురాం సినిమాలు అంటే హీరోయిన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. అలాగే ఫ్యామిలీ స్టార్ లో కూడా మృణాల్ పాత్రని డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి చాలా మంది నార్త్ హీరోయిన్స్ కి భిన్నంగా మృణాల్ టాలీవుడ్ లో నటిగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి.