Begin typing your search above and press return to search.

చేతినిండా పని కూడా ఇబ్బందేనా..?

సీతారామం హిట్ తో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. సీతారామం తర్వాత హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అందుకుంది

By:  Tupaki Desk   |   19 March 2024 5:32 AM GMT
చేతినిండా పని కూడా ఇబ్బందేనా..?
X

తెలుగులో సరికొత్త ధృవ తార మృణాల్ ఠాకూర్ సూపర్ ఫాం కొనసాగిస్తుంది. బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ అక్కడ టాలెంట్ చూపించిన మృణాల్ ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమా ఛాన్స్ అందుకుంది. అక్కడ సినిమాల్లో నటిస్తూ హను రాఘవపుడి దృష్టిలో పడింది. సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ చేసిన సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలో అమ్మడు నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సీతారామం హిట్ తో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. సీతారామం తర్వాత హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అందుకుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది అమ్మడు. ఇటు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ అటు బాలీవుడ్ లో కూడా రాణిస్తుంది మృణాల్ ఠాకూర్. కెరీర్ లో సూపర్ ఫాం కొనసాగిస్తున్న అమ్మడు బిజీ బిజీగా ఉంటుంది. అయితే ఈ టైం లో సరదాగా తీసుకునే చిన్న బ్రేక్ వర్క్ మీద మరింత ఫోకస్ చేసేందుకు ఉపయోగపడుతుందని అంటుంది.

రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు బిజీ బిజీ టైం లో సరదాగా తీసుకునే విరామాలు మనల్ని మనం మరింత మెరుగు పరచుకునేందుకు ఇంకా సినిమాల ఎంపిక విషయంలో కూడా ఎంతో దోహదపడతాయని అంటుంది మృణాల్ థాకూర్. లాస్ట్ ఇయర్ ఆరు సినిమాల్లో నటించిన మృణాల్ ఈ ఇయర్ కూడా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమైంది. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో నటీనటులకు కొంత బ్రేక్ టైం కూడా ముఖ్యమని అంటుంది. బిజీ బిజీగా కాలంతో పాటు పరుగెడుతున్న ఈ సినీ ప్రయాణంలో యాక్టర్స్ కొంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి.. వారితో కలిసి ప్రయాణాలు చేయడం ఎంతో ఇంపార్టెంట్ అంటుంది మృణాల్ ఠాకూర్.

రెండేళ్లుగా తీరిక లేకుండా పనిచేస్తున్న తాను సరైన నిద్ర కోసం ఆరాటపడిన సందర్భాలు ఉన్నాయని అంటుంది. రీసెంట్ గా అమ్మడి సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసింది. ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని.. సినిమాల ఎంపికలో కూడా ఇది సహకరిస్తుందని అంటుంది మృణాల్. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇదో మంచి పద్ధతి అంటుంది మృణాల్.