Begin typing your search above and press return to search.

మృణాల్ లక్కీ టైమ్.. అయినా ఇంత స్లో ఎందుకంటే..

అయితే ఆ తప్పు తాను మాత్రం చేయనంటున్నారు సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్.

By:  Tupaki Desk   |   10 Feb 2024 2:30 PM GMT
మృణాల్ లక్కీ టైమ్.. అయినా ఇంత స్లో ఎందుకంటే..
X

ఒక్క హిట్ పడిందంటే చాలు.. వెంటనే 10 సినిమాలు ఒప్పేసుకుంటారు కొందరు హీరోయిన్లు. అలా చేసి నష్టపోయిన ముద్దుగుమ్మలు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే ఆ తప్పు తాను మాత్రం చేయనంటున్నారు సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్. సినిమాల ఎంపికలో చాలా సైలెంట్‌గా ఉంటూనే సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారు.

టాలీవుడ్‌ లో మృణాల్ ఠాకూర్.. చేసింది రెండు సినిమాలే కావచ్చు.. కానీ ఆ రెండింట్లోనూ ఆమె గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ మాట్లాడింది. సీతారామంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది. తన సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఫస్ట్ తెలుగు మూవీతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత తన నెక్స్ట్ తెలుగు సినిమాకు ఓకే చెప్పడానికి చాలా టైమ్ తీసుకుంది.

నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాలో నటించింది మృణాల్. ఈ మూవీలో కూడా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది. మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేదు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాతే మరో టాలీవుడ్ ఆఫర్ కు ఓకే చెప్పాలనుకుంటుందట.

దీంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారట. కానీ మృణాల్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారట. ఓ సినిమా అయ్యాకే.. మరో సినిమా అంటూ నింపాదిగా అడుగులేస్తున్నారట. కథ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారట. బాలీవుడ్ కన్నా టాలీవుడ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. అయితే బాలీవుడ్ లో ఆమె పలు సినిమాలు నటించిన ఆమె అంతలా ఫేమ్ సంపాదించని విషయం తెలిసిందే.

మరోవైపు, మృణాల్‌ ఠాకూర్‌ కు కోలీవుడ్ లో మూడు భారీ ఆఫర్లు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్‌ నటిస్తున్న ఓ చిత్రంలో మృణాల్‌ ను హీరోయిన్‌ గా తీసుకున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. శింబు భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్ లో ఆమె నే ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశారట. నటుడు అజిత్ మూవీలో కూడా ఆమెకు ఛాన్స్ వచ్చిందట. కానీ ఆమె మాత్రం ఇంకా ఏ మూవీకి ఓకే చెప్పలేదట. మరి అటు టాలీవుడ్.. ఇలా కోలీవుడ్‌ లో మృణాల్ ఫాలో అయ్యే సెలక్షన్ వే ఆమె కెరీర్‌ ను ఎలా డిసైడ్ చేయబోతుందో చూడాలి.