Begin typing your search above and press return to search.

బ్యాక్ పోజ్.. ఛాన్సే లేదన్న మృణాల్!

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Tupaki Desk   |   19 March 2024 6:02 PM GMT
బ్యాక్ పోజ్.. ఛాన్సే లేదన్న మృణాల్!
X

రెండేళ్ల క్రితం రిలీజైన సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ రోల్స్ చేసిన ఈ అమ్మడు.. తన నటనతో కట్టిపడేసింది. తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సంపాదించుకంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. గతేడాది హాయ్ నాన్న మూవీలో నాని సరసన నటించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు తెలుగులో సినిమాలు చేస్తూ.. అటు బాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. చేతినిండా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. గత ఏడాది ఆరు సినిమాలతో వచ్చిన ఈ బ్యూటీ.. 2024 లో కూడా వరుస మూవీలతో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఇదంతా పక్కన పెడితే.. మృణాల్ ఠాకూర్ తాజాగా ముంబయిలో జరిగిన ఓ అవార్డుల వేడుకలో పాల్గొంది. అందుకు బ్లాక్ కలర్ టైట్ ఔట్ ఫిట్ ధరించి గ్లామరస్ గా రెడీ అయ్యి వెళ్లింది. వేడుకలో రెడ్ కార్పెట్ పై వాక్ చేసి హోయలు ఒలికించింది మృణాల్. తన అందంతో పాటు నవ్వుతోనే అందరినీ మాయ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే వేడుకలో ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో మృణాల్ ఠాకూర్ తో ఓ ఫొటోగ్రాఫర్ కాస్త అతిగా ప్రవర్తించాడు. ఆమె రకరకాల పోజులు ఇస్తుండగా.. సదరు ఫొటోగ్రాఫర్ ఆమె ను ఒకసారి బ్యాక్ పోజ్ ఇవ్వమని అడిగాడు. అందుకు ఆమె ఒక్కసారిగా షాకయ్యి నో చెప్పింది. కానీ అతడు మరోసారి అడిగ్గా.. మృణాల్ కోప్పడకుండా నవ్వుతోనే మళ్లీ నో చెప్పేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అంతకుముందు తాను పోజు ఇవ్వకపోయినా.. మీ కెమెరాలు అక్కడికే వెళ్లిపోతాయిగా అని నవ్వుతూ కామెంట్ చేసింది మృణాల్ ఠాకూర్. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఎలాంటి కోపం తెచ్చుకోకుండా నో చెప్పడం గ్రేట్ అని అంటున్నారు. ఫేస్ లో ఎలాంటి కోపం కనపడనివ్వలేదని కామెంట్లు పెడుతున్నారు.