Begin typing your search above and press return to search.

ఏ హీరోయిన్‌ చేయని పని చేసిన మృణాల్‌

మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా భారీ ఎత్తున జరిగింది.

By:  Tupaki Desk   |   3 April 2024 4:10 AM GMT
ఏ హీరోయిన్‌ చేయని పని చేసిన మృణాల్‌
X

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయినా దక్కని స్టార్‌ డమ్‌ సీతారామం సినిమాతో మృణాల్‌ ఠాకూర్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత నానితో కలిసి నటించిన హాయ్‌ నాన్న సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమా తో మృణాల్‌ ఠాకూర్ టాలీవుడ్‌ లో హ్యాట్రిక్ కొట్టబోతుంది అనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా భారీ ఎత్తున జరిగింది.

ఆ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తాను తెలుగు ప్రేక్షకులకు రుణపడి పోయాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు మృణాల్‌ స్టేజ్‌ పై సాష్టాంగ నమస్కారం చేసి అందరిని సర్‌ ప్రైజ్ చేసింది. ఏ తెలుగు హీరోయిన్ కూడా ఇప్పటి వరకు ఇలాంటి పని చేయలేదు.

ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం... కానీ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం అనేది కచ్చితంగా మృణాల్ కే చెల్లింది. ఆమె మనసులో తెలుగు ప్రేక్షకుల పట్ల ఎంత గౌరవం మరియు ప్రేమ ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్లు మరియు మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

సీతారామం మరియు హాయ్‌ నాన్న సినిమాలతో నన్ను తెలుగు అమ్మాయిగా మార్చేశారు. మీ ప్రేమకు మరియు మద్దతుకు ధన్యవాదాలు అంది. విజయ్‌ దేవరకొండతో పని చేయడం అనేది ప్రతి హీరోయిన్‌ కల. ఈ సినిమాను మా నాన్నకు అంకితం ఇస్తున్నట్లుగా మృణాల్‌ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ లో పలు సినిమాలు చేసిన మృణాల్‌ కి ఇప్పటి వరకు అక్కడ కమర్షియల్ గా భారీ విజయం దక్కింది లేదు. కానీ టాలీవుడ్‌ లో మాత్రం ఇప్పటికే వరుసగా రెండు భారీ విజయాలు సొంతం అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌ తో హ్యాట్రిక్ కొడతాను అంటూ చాలా నమ్మకంగా మృణాల్‌ కనిపిస్తోంది. ముందు ముందు మృణాల్ టాలీవుడ్ లో మరింత బిజీ అవ్వాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.