Begin typing your search above and press return to search.

మృణాల్ గేమ్ ఛేంజింగ్ ఆఫ‌ర్?

తాను పాత్ర‌ల విష‌యంలో సెల‌క్టివ్ గా ఉంటున్నాన‌ని మృణాల్ తాజా ఇంటర్వ్యూలో వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   5 April 2024 1:30 AM GMT
మృణాల్ గేమ్ ఛేంజింగ్ ఆఫ‌ర్?
X

మృణాల్ ఠాకూర్ దక్షిణాదిలో భారీ డిమాండ్ ఉన్న క‌థానాయిక‌. బాలీవుడ్ లోను భారీ అవ‌కాశాలు అందుకుంటోంది. సీతా రామం, హాయ్ నాన్న వంటి చిత్రాలు అనూహ్య విజయాలు సాధించడంతో మృణాల్‌కు తెలుగు చిత్ర‌సీమ నుంచి వ‌రుస‌గా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ద‌క్షిణాదిన ఎన్ని అవ‌కాశాలు వ‌స్తున్నా కానీ, బాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేయడంపై ఈ బ్యూటీ దృష్టి సారించిందని క‌థ‌నాలొస్తున్నాయి.

తాను పాత్ర‌ల విష‌యంలో సెల‌క్టివ్ గా ఉంటున్నాన‌ని మృణాల్ తాజా ఇంటర్వ్యూలో వెల్ల‌డించింది. చూస్తుంటే మునుముందు మ‌రిన్ని ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో ఆక‌ట్టుకునే పాత్ర‌ల్లో మాత్ర‌మే మృణాల్ న‌టించాల‌ని భావిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇలాంటి స‌మ‌యంలో మృణాల్ తదుప‌రి క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీతో క‌లిసి ప‌ని చేయ‌నుంది. ఇది పీరియాడిక‌ల్ డ్రామాతో రూపొంద‌నున్న సినిమా అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్న మృణాల్ ఈ విష‌యాన్ని మ‌రోసారి ఖ‌రారు చేసింది.

భ‌న్సాలీతో ఆఫ‌ర్ అంటే అది గేమ్ ఛేంజింగ్ మూవీ అని భావించాలి. భారీ సెట్లు, కాస్ట్యూమ్స్, పాత్ర‌లో డెప్త్, న‌ట‌న ప‌రంగా ఇన్ డెప్త్ పెర్ఫామెన్స్.. వెర‌సి న‌టీన‌టుల గేమ్ ని పూర్తిగా మార్చేసే ఛాలెంజింగ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ. అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క‌సారి న‌టించినా గొప్ప పేరొస్తుంద‌ని న‌టీన‌టులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఆలియా, ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకొనే, ఐశ్వ‌ర్యారాయ్ వంటి స్టార్లకు మ‌ర‌పురాని పాత్ర‌ల్లో అవ‌కాశాలు క‌ల్పించిన భ‌న్సాలీ ఇప్పుడు మృణాల్ కు అదే స్థాయి ఆఫ‌ర్ ని అందిస్తున్నాడు. భ‌న్సాలీ త‌దుప‌రి వేశ్యావాటిక నేప‌థ్యంలో రూపొందిస్తున్న‌ చిత్రంలో మ‌నీషాకొయిలారా, అదితీరావ్ హైద‌రీ స‌హా ప‌లువురు అంద‌గ‌త్తెలు అవ‌కాశం అందుకున్న సంగ‌తి తెలిసిందే.