Begin typing your search above and press return to search.

హీరోయిన్ కి ఫస్ట్ షాక్..!

హిందీ లో సీరియల్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ స్మాల్ స్క్రీన్ క్రేజ్ తోనే మరాఠి సినిమాల్లో ఛాన్స్ అందుకుంది.

By:  Tupaki Desk   |   6 April 2024 5:02 AM GMT
హీరోయిన్ కి ఫస్ట్ షాక్..!
X

హిందీ లో సీరియల్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ స్మాల్ స్క్రీన్ క్రేజ్ తోనే మరాఠి సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. మరాఠి లో వరుసగా 3 సినిమాలు చేసిన అమ్మడు 2018 నుంచి 2021 వరకు హిందీలో ఏడు సినిమాల దాకా చేసింది. అందులో హృతిక్ రోషన్ తో చేసిన సూపర్ 30, జెర్సీ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత 2022 లో సీతారామం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది మృణాల్. అమ్మడి కెరీర్ సీతారామం ముందు వరకు ఒకలా ఉంటే ఆఫ్టర్ సీతారామం ఫుల్ జోష్ అందుకుంది. సీతారామం సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యాక హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా అక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది.

సీతారామం క్రేజ్ తో తెలుగులో హాయ్ నాన్న ఛాన్స్ అందుకున్న మృణాల్ ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది. మరో పక్క బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది మృణాల్ ఠాకూర్. అయితే తెలుగులో విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ మాత్రం అమ్మడికి షాక్ ఇచ్చింది. పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా టీజర్, ట్రైలర్ తో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తామని అనిపించినా ఆశించిన స్థాయిలో మాత్రం లేదని చెబుతున్నారు.

ముఖ్యంగా రెండు హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ ని ఫ్యామిలీ స్టార్ లో సరిగా వాడుకోలేకపోయారని అంటున్నారు. మృణాల్ హిట్ సెంటిమెంట్ ఫ్యామిలీ స్టార్ కి కలిసి వస్తుందని భావించినా సినిమా ఫస్ట్ డే మాత్రం మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సమ్మర్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా ఈ సినిమాను ఎంకరేజ్ చేస్తే చెప్పలేం కానీ గీతా గోవిందం కాంబో అంచనాలను మాత్రం ఫ్యామిలీ స్టార్ అందుకోలేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.

అంతేకాదు తెలుగులో తన సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావడం మృణాల్ కి షాక్ ఇచ్చినట్టే అయ్యింది. సీతారామం, హాయ్ నాన్న రెండు సినిమాలు మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఫ్యామిలీ స్టార్ మాత్రం అలా జరగలేదు. సినిమాలు హిట్లు పడుతుంటే ఛాన్సులు రావడం కామనే కానీ ఫ్లాపులు వస్తే మాత్రం స్టార్ హీరో అయినా.. స్టార్ హీరోయిన్ అయినా పక్కన పెట్టేస్తారు. సో ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ మృణాల్ కెరీర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాలి.