Begin typing your search above and press return to search.

ఆ రెండు పాత్ర‌లు వైన్ లా టేస్టీ!

కాలం గ‌డిచేకొద్ది వైన్ రుచెక్కుతుందంటారు. ఆ రెండు పాత్ర‌లు అలాంటివే. నాకు ఎప్ప‌టికీ మ‌రుపు రానివిగా గుర్తిండిపోతాయి.

By:  Tupaki Desk   |   1 Feb 2024 11:30 PM GMT
ఆ రెండు పాత్ర‌లు వైన్ లా  టేస్టీ!
X

మ‌రాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగింట ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక్క‌డి అభిమా నుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని రెండు సినిమాల‌తోనే ద‌క్కించుకుంది. `సీతారామం`లో సీత పాత్ర‌..`హాయ్ నాన్న‌`లో య‌ష్న పాత్ర‌లు ఎంత గొప్పగా పండాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ రెండు పాత్ర‌లు ఆమెని ప్ర‌త్యేక‌మైన న‌టిగా తీర్చిదిద్దాయి. ఇలాంటి పాత్ర‌ల్లో తాను మాత్ర న‌టించ‌గ‌ల‌ని ప్రూవ్ చేసింది.


త‌న‌లో ఆ క్వాలిటీనే మృణాల్ ని మిగ‌తా భామల నుంచి వేరు చేస్తుంది. ఎలాంటి అశ్లీల‌త‌కు తావు ఇవ్వ కుండా చేసిన ఆ పాత్ర‌లు తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోయాయి. అందుకే అంత మంచి పేరు ద‌క్కించుకుంది. తాజాగా ఈరెండు పాత్ర‌ల గురించి మృణాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సీత‌..య‌ష్న పాత్ర‌ల గురించి ఎక్క‌డికి వెళ్లినా మాట్లాడుకుంటున్నారు. మెచ్చుకుంటున్నారు.

కాలం గ‌డిచేకొద్ది వైన్ రుచెక్కుతుందంటారు. ఆ రెండు పాత్ర‌లు అలాంటివే. నాకు ఎప్ప‌టికీ మ‌రుపు రానివిగా గుర్తిండిపోతాయి. సీతారామంలో కొన్ని స‌న్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్ప‌టికీ ఆ స‌న్నివేశాల‌కు సంబంధించిన క్లిపింగ్స్ పంపిస్తుంటారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా న‌టించింది నేనే అని ఒక్క క్ష‌ణం ఆశ్చ‌ర్య‌పోతా. ఇలాంటి పాత్ర‌లు రావ‌డం చాలా అరుదు.

వ‌చ్చిన‌ప్పుడు వ‌దులుకుంటే వాళ్లంతా అన్ ల‌క్కీ ప‌ర్స‌న్స్ ఇంకెవ్వ‌రు ఉండరు. నేను ఏ పాత్ర ఎంపిక చేసుకున్నా మృణాల్ ని మ‌ర్చిపోయినా అందులో న‌టించిన న‌టిని మ‌ర్చిపోకూడ‌ద‌ని భావిస్తా. అవ‌న్నీ ఆలోచించే ఏ సినిమాకైనా న‌టిస్తా. నా పేరు మ‌ర్చిపోయినా నా పాత్ర‌ల పేర్లు ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తిం డిపోవాలి. అందుకే బ‌ల‌మైన పాత్ర‌ల ఎంపిక విష‌యంలో ఎక్కువ స‌మ‌యం తీసుకుంటున్నా` అని తెలిపింది.