Begin typing your search above and press return to search.

మృణాల్ ని అందుకు ప‌నికిరాద‌న్నారా?

హిందీ బుల్లి తెర నుంచి బాలీవుడ్‌ లో అడుగు పెట్టి అక్కడ నుంచి సీతారామం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌.

By:  Tupaki Desk   |   13 Feb 2024 2:30 PM GMT
మృణాల్ ని అందుకు ప‌నికిరాద‌న్నారా?
X

హిందీ బుల్లి తెర నుంచి బాలీవుడ్‌ లో అడుగు పెట్టి అక్కడ నుంచి సీతారామం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. ప్రస్తుతం బాలీవుడ్ తో కంటే ఎక్కువగా సౌత్ సినిమాల్లో నటిస్తోంది. తెలుగు లో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్‌ సినిమాలో చేస్తున్న విషయం తెల్సిందే.

ఇక తమిళంలో శింబు హీరోగా నటించబోతున్న సినిమాతో పాటు శివ కార్తికేయన్ సినిమాలో కూడా ఈ అమ్మడు నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా తమిళ స్టార్‌ అజిత్ హీరోగా రూపొందబోతున్న సినిమాలో కూడా మృణాల్ ను ఎంపిక చేశారు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. తెలుగు లో బ్యాక్ టు బ్యాక్‌ సీతారామం మరియు హాయ్ నాన్న సినిమాలతో ఆకట్టుకున్న మృణాల్‌ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సౌత్‌ తో పోల్చితే బాలీవుడ్‌ నుంచి మంచి ఆఫర్లు రావడం లేదు. అందుకే నాకు మంచి పాత్రలు వచ్చిన చోటే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా హీరోయిన్‌ పాత్రకు, లేదంటే ప్రత్యేకమైన పాత్రలు చేయాలని కాకుండా నటనకు స్కోప్ ఉన్న ప్రతి ఒక్క పాత్రను చేయాలి అనేది నా కోరిక.

నేను కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా సినిమాల్లో ఆఫర్ల కోసం సంప్రదించిన సమయంలో నువ్వు గ్లామర్‌ పాత్రలు చేయలేవు అన్నారు. స్కిన్‌ షో చేసే పాత్రలు నాకు చేతనవ్వదు అన్నారు. అయితే నేను దర్శకులు నా నుంచి ఎలాంటి పాత్రలు కోరుకుంటారో అలాంటి పాత్రను చేసి నన్ను నేను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.

సౌత్‌ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సౌత్‌ పాన్‌ ఇండియా మూవీస్‌ ల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్‌ తర్వాత తెలుగు లో పెద్ద సినిమాలను వరుసగా దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.