Begin typing your search above and press return to search.

అసూయ కాదు ఆలోచించండి అంటున్న హీరోయిన్..!

బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 11:30 AM GMT
అసూయ కాదు ఆలోచించండి అంటున్న హీరోయిన్..!
X

బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటుంది. సీతారామం ఆ వెంటనే హాయ్ నాన్న రెండు హిట్లు కొట్టడంతో మృణాల్ ఇక్కడ సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ లో నటిస్తుంది అమ్మడు. తెలుగులో ఓ పక్క అదరగొడుతున్నా కూడా బాలీవుడ్ లో తను ఆశించిన స్థాయి అవకాశాలు రావట్లేదని ఫీల్ అవుతుంది మృణాల్.


ఇదిలాఉంటే నెపొటిజం మీద మృణాల్ తన మార్క్ కామెంట్ చేశారు. సినీ ప్రముఖులకు జన్మించడం అనేది పిల్లల తప్పు కాదు. నెపొటిజం పేరుతో స్టార్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తారు.. నిందిస్తుంటారో తనకు అర్ధం కాదని అన్నారు. కామన్ ఆడియన్స్ కు స్టార్స్ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అందుకే మీడియా వారే వాళ్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని అన్నది. అంతేకాదు రీసెంట్ గా ఒక ఈవెంట్ లో తన ఇంటర్వ్యూ జరుగుతున్న టైం లో జాన్వి కపూర్ ఒక స్టార్ కిడ్ తో వస్తే తనని వదిలేసి పరుగెత్తుకుంటూ వాళ్ల దగ్గరకు వెళ్లారు.

ఒకవేళ జాన్వికి అవార్డు వచ్చి ఉంటే తనకు స్పీచ్ ఇచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. ఇది సరైన పద్ధతి కాదు. అసూయతో ఇది చెప్పట్లేదు. ఇది జాన్వి తప్పు కూడా కాదని అంటుంది మృణాల్. అసూయ కాదు ఆలోచించండి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని మీడియా వాళ్లకే పంచ్ వేసింది మృణాల్ ఠాకూర్.

మృణాల్ వ్యక్త పరచిన విషయంలో వాస్తవం ఉంది. తను మాట్లాడుతున్న టైం లో ఎవరో స్టార్ వచ్చారని ఆమెను వదిలి వెళ్లడం అనేది ఎంతో బాధ పెడుతుంది. అయితే దీనికి నెపొటిజం అని తెలివి తక్కువ కామెంట్స్ చేయకుండా మృణాల్ మీడియానే తప్పు పడుతూ కామెంట్స్ చేసింది. ఓ విధంగా మృణాల్ చెప్పిన దానిలో వాస్తవం ఉందని చెప్పొచ్చు.

ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో నటించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా హిట్ పడితే టాలీవుడ్ లో అమ్మడు హ్యాట్రిక్ హిట్లు కొట్టినట్టు అవుతుంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత అమ్మడు రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు టాక్. వాటి గురించి త్వరలో అప్డేట్స్ బయటకు వస్తాయి.