Begin typing your search above and press return to search.

మృణాల్ స‌వాల్.. అలా జ‌ర‌క్క‌పోతే పేరు మార్చుకుంటా!

రిలీజ్ కి ముందు స‌వాల్ చేయడం టాలీవుడ్ హీరోలకు కొత్తేం కాదు. రిలీజ్ కి ముందు ప్రతీ సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని త‌మదైన శైలిలో స‌వాల్ చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 6:32 AM GMT
మృణాల్ స‌వాల్.. అలా జ‌ర‌క్క‌పోతే పేరు మార్చుకుంటా!
X

రిలీజ్ కి ముందు స‌వాల్ చేయడం టాలీవుడ్ హీరోలకు కొత్తేం కాదు. రిలీజ్ కి ముందు ప్రతీ సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని త‌మదైన శైలిలో స‌వాల్ చేస్తుంటారు. వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయి? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. ముందు జ‌నాల్ని థియేట‌ర్ కు ర‌ప్పించాలంటే? ఇలాంటి స‌వాళ్లు అప్పుడ‌ప్పుడు త‌ప్పవు. కానీ హీరోయిన్లు స‌వాల్ చేయ‌డం..తొడ కొట్ట‌డాలు లాంటివి ఎక్క‌డా జ‌ర‌గ‌వు.

వీలైనంత వ‌ర‌కూ కామ్ గోయింగ్ వెళ్లిపోతుంటారు. వాళ్లు లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేసినా మీడియా హైప్ ఇస్తుంది త‌ప్ప‌! వాళ్ల‌కు వాళ్ల‌గా కెమెరా ముందుకొచ్చి ఫోక‌స్ అయ్యే ప్ర‌య‌త్నం చేయ‌రు. కానీ ఇలా రిలీజ్ అవ్వ‌క‌పోతే పేరు మార్చుకుంటానని భారీ స‌వాల్ చేసిన హీరోయిన్ మాత్రం ఇంత‌వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కులు చూసి ఉండ‌దు. ఆమె ముంబై భామ మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ‌.

నా సినిమా హిట్ అవ్వ‌క‌పోతే పేరు మార్చుకుంటాన‌ని ప‌బ్లిక్ గా...వైజాగ్ ప్రేక్ష‌కుల సాక్షిగా స‌వాల్ విసిరింది. నేచుర‌ల్ స్టార్ నాని.మృణాల్ జంట‌గా `హాయ్ నాన్న` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మృణాల్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మాట్లాడింది. గ‌తంలో `సీతారామం` ప్ర‌చారంలో భాగంగా వైజాగ్ వ‌చ్చాను.

ఇప్పుడు `హాయ్ నాన్న‌`తో మ‌రోసారి మీ ముందుకు వ‌స్తున్నా.తెలుగు అమ్మాయిలా న‌న్ను స్వీక‌రించిం నందుకు మీకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. నాని-బేబి కియారా పెర్పార్మెన్స్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఈ తండ్రీ-కూతుళ్ల ప్రేమ‌లో మీరంతా ప‌డిపోతారు. అలా జ‌ర‌గ‌క‌పోతే నా పేరు మార్చుకుంటా` అంటూ మృణాల్ స‌వాల్ విసిరింది. ఇప్పుడా వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. మీణాల్ చాలా పెద్ద స‌వాలే విసిరింది అంటూ నెటి జ‌నులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. `సీతార‌మం`లో సీత పాత్ర‌లో మృణాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. ఆపాత్ర‌తోనే అమ్మ‌డికి భారీ ఫాలోయింగ్ పెరిగింది.