Begin typing your search above and press return to search.

కంగ‌న ప్రాప‌ర్టీని కొనేసిన మృణాల్ ఠాకూర్!

మ‌రాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కెరీర్ బాలీవుడ్..టాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలి సిందే.

By:  Tupaki Desk   |   21 Feb 2024 5:18 AM GMT
కంగ‌న ప్రాప‌ర్టీని కొనేసిన మృణాల్ ఠాకూర్!
X

మ‌రాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కెరీర్ బాలీవుడ్..టాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలి సిందే. తెలుగులో అమ్మ‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఇప్ప‌టికే రెండు విజ‌యాల‌తో స్టార్ డ‌మ్ ని ఆస్వాదిస్తుంది. తెలుగు అమ్మాయిలా ఆద‌ర‌ణ అందుకుంటుంది. ఈ ర‌క‌మైన ఫాలోయింగ్ తెలుగులో మ‌రే న‌టికి లేదు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. కేవ‌లం పాత్ర‌ల‌తో అభిమానుల హృద‌యాల‌కు ద‌గ్గ‌రైంది అన్న‌ది వాస్త‌వం.


కొత్త అవ‌కాశాలు జోరందుకున్నాయి. దీంతో ఆదాయం కూడా రెట్టింపు అయింది. ఇప్పుడా ఆదాయాన్ని రియ‌ల్ ఎస్టేట్ రూపంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా అమ్మ‌డు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కి చెందిన ప్రాప‌ర్టీని కొనుగోలు చేసిన‌ట్లు తెలిసింది. ముంబైలోని అంధేరిలో ఓ ఖ‌రీదైన కొత్త ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. ఇది గతంలో నటి కంగనా రనౌత్ తండ్రి అమర్‌దీప్ రనౌత్ ఆమె సోదరుడి జోడి కి చెందిన ప్లాట్ ఇది.

ఇది 17వ అంత‌స్తులో ఉన్న ప్లాట్ గా తెలిసింది. మృణాల్ అభిరుచుకి త‌గ్గ‌ట్టు ఇంటీరియ‌ర్ ఇప్ప‌టికే పూర్తి చేయించిందిట‌. ప్లాట్ ని పూర్తిగా త‌న టేస్ట్ కు త‌గ్గ‌ట్టు కొంత వ‌ర‌కూ రెన్నో వేష‌న్ కూడా చేయించిందిట‌. వాస్తు ప్ర‌కారం ఎక్క‌డ ఏవేవి ఉండాలి? అన్న‌ది అన్నింటిని ప‌క్కాగా అమ‌ర్చుకుందిట‌. ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ గా పేరొందిన సాగ‌ర్ భార‌తి ద్వారా ఈ డీల్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

సాగ‌ర్ భార‌తి ద్వారానే అమ్మ‌డు వివిధ సిటీల్లో కూడా కొన్ని ప్లాట్లు కొనుగోలు చేసిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం మృణాల్ అంధేరిలోనే ఓ అద్దె అపార్ట్ మెంట్ లో ఉంటుంది. తాజాగా కొత్త అపార్ట్ మెంట్ లోకి షిప్ట్ అయ్యే ప్లాన్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం మృణాల్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతోన్న `ఫ్యామిలీ స్టార్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలు న్నాయి. `గీత గోవిందం` త‌ర్వాత విజ‌య్-ప‌ర‌శురాం కాంబినేష‌న్ కావ‌డంతో ఆ సినిమా బాక్సాఫీస్ లెక్క‌లు మార్చేస్తుంద‌ని అభిమానులు గెస్ చేస్తున్నారు.