Begin typing your search above and press return to search.

మృణాల్ ఠాకూర్ జాక్ పాట్ కావాలి..!

అక్కడ స్టార్ క్రేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న మృణాల్ సినిమాలైతే గ్యాప్ లేకుండా చేస్తుంది. టాలీవుడ్ లో మాత్రం మృణాల్ కి ఒక మంచి ఇమేజ్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 9:00 AM IST
మృణాల్ ఠాకూర్ జాక్ పాట్ కావాలి..!
X

సీతారామం, హాయ్ నాన్న హిట్లతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్న మృణాల్ ఠాకూర్ 3వ సినిమా ది ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవ్వడంతో ఛాన్స్ లు రాలేదు. ఎలాగో అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ లో శృతి హాసన్ ఎగ్జిట్ అవ్వగా ఆ అవకాశాన్ని అందుకుంది మృణాల్ ఠాకూర్. ఏ హీరోయిన్ కి అయినా ఫ్లాపులు వస్తున్నాయి కాబట్టి అవకాశాలు రావు కానీ తెలుగులో 3 సినిమాలు చేస్తే రెండు సూపర్ హిట్లు కొట్టినా కూడా మృణాల్ కి మళ్లీ అవకాశాలు రావట్లేదు. దీని వెనుక రీజన్స్ ఏమై ఉండొచ్చన్న విధంగా ఆమె ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ కి కచ్చితంగా మరో మంచి జాక్ పాట్ సినిమా కావాల్సిందే. అప్పుడుకానీ అమ్మడి టాలెంట్ ఏంటన్నది అర్థం కాదని అంటున్నారు. విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ పాత్ర వరకు ఆకట్టుకుంది. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది మృణాల్ థాకూర్. సో ఆమెను నమ్మి అవకాశాలు ఇచ్చినా తప్పులేదు. ఎటొచ్చి కథల ఎంపికలోనే మృణాల్ కాస్త తడబాటు పడుతుందని అర్ధమవుతుంది.

తెలుగులో డెకాయిట్ తప్ప మరో సినిమా లేదు. ఆ సినిమా హిట్ పడితేనే మరో ఛాన్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. డెకాయిట్ తర్వాత తెలుగులో సినిమాలేవైనా డిస్కషన్ లో ఉన్నాయా అంటే లేదన్నట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. సో మృణాల్ కి తెలుగులో ఆఫర్లు రావాలంటే ఇంకా అమ్మడు తన ప్రభావం చూపించాల్సి ఉంటుంది.

ఇక అమ్మడు బాలీవుడ్ లో మాత్రం తన మార్క్ సినిమాలు చేస్తూ వెళ్తుంది. అక్కడ స్టార్ క్రేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న మృణాల్ సినిమాలైతే గ్యాప్ లేకుండా చేస్తుంది. టాలీవుడ్ లో మాత్రం మృణాల్ కి ఒక మంచి ఇమేజ్ ఏర్పడింది. అందుకే అమ్మడు ఇక్కడ సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తుంది. డెకాయిట్ తర్వాత అయినా మృణాల్ కి అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి. సీనియర్ హీరోలైనా సరే చేస్తా అని అంటున్న మృణాల్ ఠాకూర్ ని వాళ్లు కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అవకాశాల కోసం చూస్తుంది మృణాల్ ఠాకూర్. ఐతే అక్కడ తొలి సినిమాతోనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కథల ఎంపికలో కాస్త ఆచితూచి అడుగులేస్తుంది.