Begin typing your search above and press return to search.

డిమాండ్ వల్లే అమ్మడికి అవకాశాలు లేవా..?

నానితో మృణాల్ చేసిన హాయ్ నాన్న ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చింది. సినిమాలో మ్యూజిక్ కూడా ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది.

By:  Tupaki Desk   |   11 May 2025 4:00 AM IST
Mrunal Thakur Faces Setback with The Family Star
X

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఆ సినిమా సక్సెస్ అవ్వడమే కాదు ఆమెకు కెరీర్ లో ఒక మంచి జోష్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత హిందీలో కూడా మృణాల్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక తెలుగులో కూడా సీతారామం సీతామహాలక్ష్మి గా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆఫ్టర్ సీతారామం నానితో హాయ్ నాన్న సినిమా చేసి అది కూడా హిట్ సాధించింది మృణాల్. నానితో మృణాల్ చేసిన హాయ్ నాన్న ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చింది. సినిమాలో మ్యూజిక్ కూడా ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది.

వచ్చీరాగానే రెండు హిట్ సినిమాలు చేసిన మృణాల్ ని తెలుగు ఆడియన్స్ స్టార్ క్రేజ్ ఇచ్చేస్తారు అనుకున్నారు. ఐతే థర్డ్ అటెంప్ట్ గా అమ్మడు విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది. ఆ సినిమాలో తన పోర్షన్ వరకు మెప్పించినా ఓవరాల్ గా సినిమా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. రెండు హిట్లు పడ్డాక పాపులర్ అయిన మృణాల్ మొదటి ఫ్లాప్ కి షాక్ అయ్యింది. అయితే ఆ తర్వాత ఛాన్స్ లు కూడా రావట్లేదు.

మరోపక్క హిందీలో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతుంది మృణాల్ ఠాకూర్. ఒకేసారి తెలుగు ఆఫర్, హిందీ ఆఫర్ వస్తే హిందీనే పిక్ చేసుకుంటుందట మృణాల్ ఠాకూర్. అంతేకాదు తెలుగులో రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తుందని కూడా చెబుతున్నారు. ఐతే బాలీవుడ్ లో మృణాల్ ఆల్రెడీ క్రేజ్ కొనసాగిస్తుంది కాబట్టి అక్కడ భారీగానే పారితోషికం అందుకుంటుందని తెలుస్తుంది.

మరి నిజంగానే మృణాల్ టాలీవుడ్ సినిమాలను రెమ్యునరేషన్ కోసమే కాదంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఓ పక్క తన గ్లామర్ తో ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి పిచ్చెక్కేలా చేస్తున్న మృణాల్ తెర మీద చేసే పాత్రల్లో తన అభినయంతో ఆకట్టుకుంటుంది. మృణాల్ తో కంప్లీట్ గా ఒక రొమాంటిక్ రోల్ చేయిస్తే బెటర్ అని ఆడియన్స్ కోరుతున్నారు. మరి అలాంటి సినిమా ఎవరితో పడుతుంది అన్నది చూడాలి. మృణాల్ ఠాకూర్ మాత్రం తెలుగులో ఎలాంటి అవకాశం వచ్చినా తాను ఎప్పుడూ రెడీ అనేస్తుంది. ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అవి ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.