మృణాల్ ఠాకూర్.. మోస్ట్ పాపులర్ బ్యూటీ ఆమెనే!
11 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలోకి మరాఠీ మూవీ విట్టి దండుతో వచ్చిన మృణాల్.. 2018లో లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
By: Tupaki Desk | 9 Jun 2025 6:00 AM ISTహీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న అందాల ముద్దుగుమ్మ.. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. అంతే కాదు ఎంచుకున్న పాత్రలతోనే గుర్తుండిపోయే హీరోయిన్స్ లిస్ట్ లో ఆమె పేరు కచ్చితంగా టాప్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
11 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలోకి మరాఠీ మూవీ విట్టి దండుతో వచ్చిన మృణాల్.. 2018లో లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అ తర్వాత తుఫాన్, ధమాక, జెర్సీ సినిమాల్లో అవకాశాలు ఆమె సొంతమయ్యాయి. అదే సమయంలో దుల్కర్ సల్మాన్ సీతారామంతో టాలీవుడ్ లోకి వచ్చేసింది.
తెలుగు డెబ్యూ మూవీలో సీతగా అందరి మనసులు దోచేసింది. తన వింటేజ్ లుక్, మెస్మరైజింగ్ యాక్టింగ్ తో కట్టిపడేసింది. ఆ తర్వాత హాయ్ నాన్నతో మరో హిట్ ను సొంతం చేసుకున్న అమ్మడికి ఫ్యామిలీ స్టార్ తో మాత్రం నిరాశ ఎదురైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
స్టార్ హీరో ప్రభాస్ కల్కి 2898 ఏడీలో క్యామియో రోల్ పోషించిన మృణాల్.. తెలుగులో యువ నటుడు అడివి శేష్ తో కలిసి డెకాయిట్ లో నటిస్తోంది. రీసెంట్ గా గ్లింప్స్ రిలీజ్ అవ్వగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అటు బాలీవుడ్ లో సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, హేజవానీ తో ఇష్క్ చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది మృణాల్ ఠాకూర్.
అయితే టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అమ్మడు.. ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ గా నిలిచింది మన సీత. నెట్టింట ఆమె కోసమే ఎక్కువగా మాట్లాడుకున్నారట. అది నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె పిక్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
నిజానికి సినిమాలతో బిజీగా ఉన్నా.. నెట్టింట ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ ను షేర్ చేస్తుంటుంది మృణాల్. హీట్ పుట్టించే ఫొటోలతో పాటు స్పైసీ క్లిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. ఆమె క్యాప్షన్లు కూడా క్రేజీ ఉన్నాయి. దీంతో అమ్మడు పోస్టులు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. మొత్తానికి ఆమె ఇప్పుడు నెట్టింట మోస్ట్ పాపులర్ నటి అన్నమాట!
