Begin typing your search above and press return to search.

బెడ్‌ రూం పిక్స్‌ షేర్‌ చేసిన మృణాల్‌

పిల్లో ఫోటోలు మాత్రమే కాకుండా మౌనీ రాయ్ తో రోడ్డుపై నడుస్తూ, పాటకు అభినయం చేస్తూ ఉన్న వీడియోను షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   21 May 2025 4:22 PM IST
బెడ్‌ రూం పిక్స్‌ షేర్‌ చేసిన  మృణాల్‌
X

హిందీ బుల్లితెర, వెండి తెరపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. కాస్త ఆలస్యంగా సౌత్‌లో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా సీతారామం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దశాబ్ద కాలంగా దక్కని స్టార్‌డం దక్కింది. హిందీలోనూ ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. నార్త్‌, సౌత్‌ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకు పోతున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అత్యధిక ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సొంతం చేసుకుంది. తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసిన పిక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

సాధారణంగా బెడ్‌ రూంలో ఉండే పిల్లో ఫోటోలను షేర్‌ చేసింది. నార్మల్‌ పిల్లోలను షేర్ చేసి ఉంటే పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ ఆ పిల్లోల మీద ఉన్న టెక్ట్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. కాస్త రొమాంటిక్ యాంగిల్‌లో ఉన్న ఆ ఫోటోలోని పిల్లోస్‌ ను షేర్ చేయడం ద్వారా మృణాల్‌ ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. హార్ట్‌ షేప్‌ ఉన్న పిల్లో మీద ఈ రోజు కాదు అన్నట్లుగా టెక్ట్స్‌ ఉంది. దాని అర్థం ఏంటో అంటూ నెటిజన్స్ జుట్టు పీక్కుంటున్నారు. మరో పిల్లో పై మరింత రొమాంటిక్‌ గా టెక్ట్స్ ఉంది. ఈ పిల్లోలు షేర్‌ చేయడంతో మృణాల్‌ను కొందరు విమర్శిస్తే, కొందరు మాత్రం ఆమె బోల్డ్‌ నెస్‌కి ఫిదా అవుతూ ప్రశంసలు చేస్తున్నారు.

పిల్లో ఫోటోలు మాత్రమే కాకుండా మౌనీ రాయ్ తో రోడ్డుపై నడుస్తూ, పాటకు అభినయం చేస్తూ ఉన్న వీడియోను షేర్‌ చేసింది. ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా మృణాల్ ఠాకూర్‌ గ్లాస్గో కి వెళ్లింది. అక్కడ మౌనీ రాయ్‌తో క్వాలిటీ టైం స్పెండ్‌ చేసిందట. ఆ విషయాన్ని ఈ వీడియోతో పాటు జోడించి చెప్పుకొచ్చింది. ఈ ట్రిప్‌లో నాకు చాలా వినోదాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను మీ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను. అప్పుడే మీ నుంచి దూరంగా వెళ్లడంను జీర్ణించుకోలేక పోతున్నాను. మిమ్ములను నేను మిస్‌ అవుతున్నాను. నేను పలు విషయాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చడంలో మీరు నేర్పిన విషయాలు ఉపయోగపడుతాయని మృణాల్‌ చెప్పుకొచ్చింది.

తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్‌ ఆ తర్వాత కాస్త స్లో అయింది. ప్రస్తుతం అడవి శేష్‌ తో కలిసి డెకాయిట్‌ సినిమాలో నటిస్తుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న ఆ సినిమా తర్వాత మృణాల్ తెలుగు, హిందీలో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు. మృణాల్‌ ఠాకూర్‌ తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని, ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే మృణాల్‌ తమిళ్ మూవీతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.