తల్లి అవాలనుంది.! కానీ..
అందరిలానే తనకు కూడా అమ్మ కావాలని ఉన్నట్టు సక్సెస్‌ఫుల్ హీరోయిన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ చెప్తున్నారు.
By: Tupaki Desk | 25 July 2025 11:08 AM ISTఆడవాళ్లకు మాతృత్వం అనేది ఎంతో గర్వం. ఆడదానిగా పుట్టాక అమ్మ అని పిలిపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. దానికి ఎంతటి సెలబ్రిటీలైనా మినహాయింపు కాదు. అందరిలానే తనకు కూడా అమ్మ కావాలని ఉన్నట్టు సక్సెస్‌ఫుల్ హీరోయిన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ చెప్తున్నారు. అయితే అమ్మడి కామెంట్స్ విని అంతా షాకవుతున్నారు.
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. మృణాల్ ముందు బాలీవుడ్ లో పరిచయమైనా అక్కడ తనకు రావాల్సిన గుర్తింపు రాలేదు. అయితే ఏ ముహూర్తాన సీతారామం సినిమా చేశారో కానీ అప్పట్నుంచి మృణాల్ కెరీర్ టర్న్ అయిపోయింది. సీతారామంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు మృణాల్.
ఆ సినిమా తర్వాత అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. కానీ మృణాల్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో షానియెల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా డెకాయిట్ అనే సినిమా చేస్తున్న మృణాల్ మరో వైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ నటించిన సన్నాప్ సర్దార్2 రిలీజ్ కు ముస్తాబవుతుంది.
ఆ చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న మృణాల్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనక్కూడా త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని ఉందని చెప్పిన మృణాల్, ఫ్యూచర్ లో భర్త, పిల్లలతో కలిసి ఉన్న లైఫ్ గురించి నిరంతరం కలలు కంటుంటానని అన్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉందని, ఇంకా ఇండస్ట్రీలో చాలా చేయాలనుకుంటున్నట్టు మృణాల్ తెలిపారు. కెరీర్ పరంగా ఫుల్ గా శాటిస్‌ఫై అయ్యాకే వ్యక్తిగత జీవితంపై ఫోకస్ చేస్తానని మృణాల్ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మృణాల్ ఈ విషయంలో చాలా తెలివిగానే ఆలోచిస్తున్నారు. పెళ్లి తర్వాత ఎంతలేదన్నా హీరోయిన్లకు ఆఫర్లు తగ్గడం కామన్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మృణాల్ పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేయడం లేదని అనుకోవచ్చు.
