మృణాల్ వర్కవుట్ బడ్డీ ఎవరో తెలుసా?
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని వారి గుండెల్లో సీతగా నిలిచిన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
By: Tupaki Desk | 5 Jun 2025 8:52 PM ISTసీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని వారి గుండెల్లో సీతగా నిలిచిన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మృణాల్ సోషల్ మీడియాలో తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా మృణాల్ జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
అయితే ఆ వీడియోలో కేవలం మృణాల్ ఫిట్‌నెస్ రొటీన్ మాత్రమే అందరి దృష్టిని ఆకర్షించలేదు, ఆ వీడియోలో మృణాల్ ఒకరిని మిస్ అవుతున్నట్టు వెల్లడించింది. ఆమె మరెవరో కాదు, మృణాల్ వర్కవుట్ ఫ్రెండ్, సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే. మృణాల్ తన వర్కవుట్ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ మిస్ యూ పూజా హెగ్డే అని సదరు హీరోయిన్ ను ట్యాగ్ చేసింది మృణాల్.
ఈ వీడియోలో మృణాల్ లెగ్ వర్కవుట్ చేస్తూ కనిపించడంతో పాటూ జిమ్ లో నేలపై కూర్చున్న కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ పోజులిచ్చిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తను నటిస్తున్న డెకాయిట్ సినిమాలో తన పాత్ర కోసం రెడీ అవడానికి, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి కసరత్తులు చేస్తోంది.
రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ, డెకాయిట్ లోని పాత్ర కోసం ఫిజికల్ గా, మెంటల్ గా రెడీ అవుతున్న మృణాల్ తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్ తో పని చేస్తోంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నుంచి ఫైట్స్ వరకు అన్ని విషయాల్లోనూ ట్రైనింగ్ తీసుకుని ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తోంది మృణాల్. షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తుంగా, మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
