యువహీరోతో ప్రేమలో ఆ ఇద్దరు భామలు!
వీరితో పాటు మృణాల్ ఠకూర్ కూడా సెట్స్ లో చేరుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి కథేమిటి? అన్నది టీమ్ రివీల్ చేయలేదు.
By: Tupaki Desk | 1 May 2025 8:30 PM'సీతారామం' లాంటి ప్రేమకథా చిత్రంలో తనదైన నటనతో చెరగని ముద్ర వేసిన మృణాల్ ఠాకూర్, ఇటీవలి కాలంలో ప్రేమకథల్ని మించి ప్రయోగాలకు సిద్ధమేనని తెలిపింది. కల్కిలో చిన్న పాత్రే అయినా అవకాశాన్ని విడిచిపెట్టలేదు మృణాల్. ఇప్పుడు వరుణ్ ధావన్ సరసన ఓ క్రేజీ ప్రేమకథా చిత్రంలో నటించనుందని సమాచారం. చూస్తుంటే ఈ సినిమా ముక్కోణ ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. ఇందులో పూజా హెగ్డే మరో కథానాయికగా నటించనుంది.
'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనేది సినిమా టైటిల్. డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ స్కాట్లాండ్‌లో జోరుగా జరుగుతోంది. మే 1 నుంచి రెండు నెలల పాటు సాగే చిత్రీకరణలో వరుణ్ ధావన్- పూజా హెగ్డే జంట పాల్గొంటున్నారు. వీరితో పాటు మృణాల్ ఠకూర్ కూడా సెట్స్ లో చేరుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి కథేమిటి? అన్నది టీమ్ రివీల్ చేయలేదు.
బుధవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో మృణాల్ కెమెరాల కంటికి చిక్కింది. అక్కడ తన డ్రైవర్‌కు వీడ్కోలు చెప్పి, వేరొక స్నేహితుడికి వెచ్చని కౌగిలింతను అందించి లోపలికి నిష్కృమించింది. అయితే మృణాల్ వెళుతున్నది స్కాట్లాండ్ షెడ్యూల్ కోసమేనా కాదా? అన్నదానిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనే టైటిల్ సల్మాన్ - కరిష్మా కపూర్ నటించిన 'బివి నంబర్-1'లోని హిట్ సాంగ్ 'ఇష్క్ సోనా హై..' నుండి తీసుకున్నారు. 'బివి నంబర్ వన్'కి కూడా డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. మృణాల్ ఈ చిత్రంతో పాటు, దేవగన్ సరసన 'సర్ధార్' అనే చిత్రంలో నటిస్తోంది. జూలైలో ఈ సినిమా విడుదల కానుంది. శేష్ కథానాయకుడిగా నటిస్తున్న 'డకోయిట్: ఎ లవ్ స్టోరీ'లోను మృణాల్ నటిస్తోంది.