Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : మృణాల్‌ అనుకోని అతిథికి హాయ్‌..!

'సీతారామం' బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం అడవి శేష్‌తో కలిసి 'డెకాయిట్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   23 April 2025 3:27 PM IST
పిక్‌టాక్ : మృణాల్‌ అనుకోని అతిథికి హాయ్‌..!
X

'సీతారామం' బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం అడవి శేష్‌తో కలిసి 'డెకాయిట్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అయితే హిందీలో మాత్రం ఈమె దాదాపు అర డజను సినిమాలు చేస్తుంది. అందులో కొన్ని షూటింగ్ దశలో ఉంటే కొన్ని చర్చల దశలో ఉన్నాయి. రాబోయే ఏడాది కాలంలో నాలుగు అయిదు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చేంత బిజీగా ఉంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న మృణాల్‌ ఠాకూర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మరోసారి తన ఫోటోను షేర్‌ చేయడం ద్వారా ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది.


ఈసారి తన క్లోజప్ ఫోటోను షేర్‌ చేసి ఫేస్ పై ఉన్న మొటిమను చూపించింది. సాధారణంగా హీరోయిన్స్‌, సెలబ్రిటీలు మొటిమలను దాచేందుకు శథవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటిది మృణాల్ ఠాకూర్ తన మొటిమను చూపించడంతో పాటు, ఆ మొటిమకు హాయ్ అంటూ ఫన్నీ పోస్ట్‌ను షేర్ చేసింది. హాయ్‌ పింపుల్‌, నువ్వు వెళ్లేది ఎప్పుడు..? నాకు త్వరలోనే షూట్‌ ఉంది అంటూ స్మైల్‌ ఈమోజీలను షేర్‌ చేసింది. కనిపించి కనిపించకుండా ఉన్న ఆ మొటిమను గురించి ఆందోళన చెందకుండా చాలా సింపుల్‌గా ఆ మొటిమకు సంబంధించిన విషయాన్ని తీసుకున్న మృణాల్ ఠాకూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

చాలా మంది అమ్మాయిలు ఒక్క మొటిమ రాగానే బాబోయ్ నా ఫేస్ అంతా పాడై పోతుందేమో, నా అందం తగ్గుతుందేమో అని భయపడుతారు. ఇక హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొటిమలు రాకుండా ముందస్తుగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మృణాల్ ఠాకూర్ మాత్రం తనకు వచ్చిన అనుకోని అతిథికి స్వాగతం చెప్పడంతో పాటు, ఎప్పుడు వెళ్తావు, వెళ్లిన తర్వాత షూటింగ్‌కి వెళ్లాలి అంటూ ఫన్నీగా స్పందించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మామూలుగానే హీరోయిన్స్‌ అందంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అయితే కొందరు మొటిమలతోనూ చాలా అందంగా కనిపిస్తారు. మృణాల్‌ కూడా ఆ మొటిమ ఉన్నా చాలా అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్‌ హిట్‌ దక్కించుకున్న మృణాల్‌ ఠాకూర్ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్ జాబితాలో చేరింది. హాయ్ నాన్న సినిమాలో నానికి జోడీగా నటించి మెప్పించింది. ఆ సినిమా కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆ సినిమాలో మృణాల్‌ నటనతో మెప్పించింది. మృణాల్ అందమైన రూపంతో పాటు, నటన ప్రతిభ ఉన్న నటి కావడంతో అన్ని భాషల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే ఈమె తమిళ్‌ మూవీతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హిందీలో దశాబ్ద కాలంగా సినిమాలు చేస్తోంది. ఈమధ్య కాలంలో అక్కడ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈమె బుల్లి తెరపై కూడా కెరీర్‌ ఆరంభంలో కనిపించి సందడి చేసింది.