సైలెంట్ గా జారుకున్న మృణాల్
ఈ పోస్ట్ లో మృణాల్ తన ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ స్టూడియో నుంచి ఎలా తప్పించుకుందో ఓ ఫన్నీ రీల్ చేసి అందరినీ నవ్వించింది.
By: Tupaki Desk | 19 May 2025 3:52 PM ISTడ్యాన్స్ క్లాస్ లో ఎవరైనా సరే చెమట, అలసిపోవడం, స్ట్రెచెస్ లాంటివి ఆశిస్తారు కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం సడెన్ గా ఓ నెయిల్ అపాయింట్‌మెంట్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరించింది. సినిమాలతో పాటూ సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ పోస్ట్ లో మృణాల్ తన ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ స్టూడియో నుంచి ఎలా తప్పించుకుందో ఓ ఫన్నీ రీల్ చేసి అందరినీ నవ్వించింది. ఆ వీడియోలో మృణాల్ నవ్వుతూ కనిపించింది. క్యాజువల్ బ్లాక్ టాప్, బ్లూ బాటమ్ ధరించి మృణాల్ ఈ వీడియోలో చాలా సింపుల్ గా ఉంది. నెయిల్స్ చేయించుకోవడానికి వెళ్తున్నట్టు మృణాల్ ఆ పోస్ట్ లో తెలిపింది.
డ్యాన్స్ స్టూడియోలో కోచ్ డిస్కషన్స్ చేస్తున్న టైమ్ లో మృణాల్ తన ఫ్రెండ్ తో కలిసి చాలా సైలెంట్ గా అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటకు వచ్చారు. మృణాల్ చేసిన ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం మృణాల్ కు కొత్తేమీ కాదు. ఆమె తరచూ సినిమా షూటింగ్ గ్యాప్ లో ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్లను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి మృణాల్ తన రియల్ లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను షేర్ చేసి నెట్టింట వైరల్ అవుతుంది.
సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సీతారామంతో అందరినీ ఆకట్టుకున్న మృణాల్ ఆ తర్వాత హాయ్ నాన్న లాంటి మరో మంచి సినిమా తీసి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం మృణాల్ అడివి శేష్ తో కలిసి డెకాయిట్ అనే సినిమా చేస్తుండగా, ఆ మూవీ కోసం కోసం మృణాల్ చాలా కొత్తగా మేకోవర్ అవుతున్నట్టు తెలుస్తోంది.
