మృణాల్ ఆశలన్నీ ఆ సినిమా మీదే..!
బాలీవుడ్ లో రాణిస్తూ సీతారామం తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన భామ మృణాల్ ఠాకూర్. ఆమె చేస్తున్న సినిమాల సంఖ్య తక్కువే అయినా ఇంపాక్ట్ మాత్రం బాగుంది.
By: Tupaki Desk | 4 Jun 2025 2:00 AM ISTబాలీవుడ్ లో రాణిస్తూ సీతారామం తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన భామ మృణాల్ ఠాకూర్. ఆమె చేస్తున్న సినిమాల సంఖ్య తక్కువే అయినా ఇంపాక్ట్ మాత్రం బాగుంది. తెలుగులో సీతారామం హిట్ కాగా నెక్స్ట్ వచ్చిన హాయ్ నాన్నతో కూడా సక్సెస్ అందుకుంది. ఐతే థర్డ్ మూవీగా చేసిన ది ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశపరిచింది. ఆ సినిమా తర్వాత మృణాల్ నెక్స్ట్ ఛాన్స్ అందుకోవడానికి కాస్త టైం తీసుకుంది. మరి అవకాశాలు రాలేదా లేదా తనకు నచ్చిన కథలు రాలేదా అన్నది తెలియదు కానీ అమ్మడు ఏడాది దాకా టైం తీసుకుంది.
ఐతే లేటెస్ట్ గా అడివి శేష్ హీరోగా వస్తున్న డెకాయిట్ ఛాన్స్ అందుకుంది మృణాల్ ఠాకూర్. డెకాయిట్ అంటూ ఒక లవ్ స్టోరీ విత్ యాక్షన్ మూవీతో రాబోతున్నారు. అడివి శేష్ చేస్తున్న ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఓ పక్క గూఢచారి 2 సినిమా చేస్తూనే మరోపక్క డెకాయిట్ ని చేస్తున్నాడు అడివి శేష్. శేష్ తో మృణాల్ జత కడుతూ వస్తున్న డెకాయిట్ సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాలను పెంచింది.
ఐతే మృణాల్ చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా డెకాయిట్ మాత్రమే. అందుకే ఆ సినిమా మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది అమ్మడు. డెకాయిట్ హిట్ పడితే మరికొన్ని అవకాశాలు వస్తాయి. ఐతే కథల ఎంపికలో మృణాల్ ఠాకూర్ కూడా తన ప్రత్యేకత చాటుతుంది. రెగ్యులర్ సినిమాల్లా కాకుండా హీరోయిన్ గా ఎంతోకొంత ఇంపాక్ట్ చూపించే కథలనే ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది.
తెలుగులో అయితే సీతారామం తో ఆమె క్రేజ్ పెరిగింది. ఐతే ఆ తర్వాత సినిమాలే ఆమె పాపులారిటీ కొనసాగించలేకపోయాయి. డెకాయిట్ సక్సెస్ అయితే మృణాల్ మళ్లీ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఐతే తెలుగు సినిమాలు చేస్తున్నా కూడా బాలీవుడ్ లో కూడా ప్రాజెక్ట్ లు చేస్తుంది మృణాల్ ఠాకూర్. అమ్మడు చేస్తున్న సినిమాల మీద ఆడియన్స్ ఆసక్తిగా ఉంటున్నారు. తెలుగు, హిందీ భాషల్లో మృణాల్ కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సో రాబోతున్న సినిమాలతో అమ్మడు మరింత క్రేజ్ ని ఏప్రరచుకోవాలని చూస్తుంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.
