Begin typing your search above and press return to search.

అదేంటి పాప అలా షాక్ ఇచ్చావ్..!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఉంటుంది. అమ్మడు తెలుగులో చేసిన 3 సినిమాల్లో రెండు సూపర్ హిట్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   24 July 2025 3:00 PM IST
అదేంటి పాప అలా షాక్ ఇచ్చావ్..!
X

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఉంటుంది. అమ్మడు తెలుగులో చేసిన 3 సినిమాల్లో రెండు సూపర్ హిట్ అయ్యాయి. థర్డ్ సినిమాలో కూడా తన వరకు ఓకే అనిపించుకుంది. ఐతే సినిమా రిజల్ట్ అనేది కమర్షియల్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మృణాల్ ఠకూర్ ఖాతాలో ఒక ఫ్లాప్ పడినట్టే లెక్క. ప్రస్తుతం అమ్మడు అడివి శేష్ తో డెకాయిట్ సినిమా చేస్తుంది. ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది మృణాల్ ఠాకూర్.

తెలుగులో చేస్తూనే బాలీవుడ్ లో ఆఫర్లు కొట్టేస్తుంది మృణాల్. ప్రస్తుతం ఆమె నటించిన సన్నాఫ్ సర్ధార్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలి, పిల్లలని కనాలని ఉందని అన్నారు మృణాల్. తల్లి అవ్వాలని తానెప్పుడూ కలలు కంటానని ఆమె చెప్పింది. ఐతే దానికి మాత్రం అసలు తొందరలేదని షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం తనస్ దృష్టి అంతా కూడా కెరీర్ మీద ఉందని.. ఇంకా చేయాలా చేయాలనుకుంటున్నా అందుకే పెళ్లి, పిల్లలు విషయాల గురించి ఇప్పుడు అసలు ఆలోచించట్లేదని అంటుంది మృణాల్. దాదాపు పెళ్లిపై హీరోయిన్స్ అంతా చెప్పే ఆన్సర్ ఇదే కదా అనొచ్చు. కానీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడప్పుడే స్థిర పడాలనే ఆలోచన లేదు కాబట్టే తాను పెళ్లిని కొన్నాళ్లు దూరం పెడుతున్నా అని అంటుంది.

పెళ్లైన హీరోయిన్స్ ఎంతైనా కెరీర్ లో వెనకపడిపోతారు. దానికి చాలామంది హీరోయిన్స్ ని ఎక్సాంపుల్ గా తీసుకుంటాం. ఐతే మృణాల్ కూడా పెళ్లి, పిల్లలు అంటే కెరీర్ కి ఎండ్ కార్డ్ పడినట్టే అని ఫిక్స్ అయ్యింది. అందుకే అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మృణాల్ నిర్ణయం ఆమె ఫ్యాన్స్ కి హ్యాపీ నెస్ తెస్తుంది. ఎందుకంటే పెళ్లైతే హీరోయిన్స్ లో మార్పులు రావడమే కాదు సినిమాల్లో చేసే అవకాశం కూడా రాదు. అందుకే పెళ్లి విషయంలో మొత్తం హీరోయిన్స్ అంతా కూడా ఒకటే రాగం పాడతారు. మిగతా వారి సంగతి పక్కన పెడితే మృణాల్ మాత్రం అనుకున్నది సాధించే దాకా పెళ్లి చేసుకునేది లేదని బల్ల గుద్ది మరీ చెబుతుంది. సో ఆమెను వెండితెర మీద ఇలానే చూస్తూనే ఉండిపోవచ్చు.