ప్రాణం పోతున్నట్టు ఉంది.. ఎమోషనల్ పోస్ట్ పంచుకున్న మృణాల్!
సినీ సెలబ్రిటీలు నిత్యం షూటింగ్ లతో బిజీగా గడిపేస్తూ తల మునకలవుతున్న విషయం అందరికీ తెలిసిందే.
By: Madhu Reddy | 15 Jun 2026 12:02 PM ISTసినీ సెలబ్రిటీలు నిత్యం షూటింగ్ లతో బిజీగా గడిపేస్తూ తల మునకలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే తమ సినిమాల షూటింగ్స్ నుండి కాస్త విరామం దొరికిందంటే చాలు తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ కొంతకాలం అక్కడే గడిపింది. తన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇప్పుడు ఆ సిటీ నుంచి వదిలి వస్తుంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు సీతామహాలక్ష్మి అలియాస్ మృణాల్ ఠాకూర్.
ఇటీవల వరుణ్ ధావన్ , పూజా హెగ్డే లతో కలిసి నటించిన హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్ ఠాకూర్ . ఇన్ని రోజులు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా మారిన ఈమె.. కొన్ని రోజుల క్రితం చికాగోకి వెళ్ళింది. అక్కడ కూడా సందడి చేసింది. ఎంతో ఎంజాయ్ చేసింది. విదేశీ వీధిలో చిట్టి పొట్టి బట్టలతో గ్లామర్ లుక్కులో కనిపించి ప్రేక్షకులను, నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అక్కడినుంచి ఇండియాకి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎంజాయ్ చేసిన మధుర జ్ఞాపకాలను ఫోటోల రూపంలో బంధించి ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
బ్యాగులు మొత్తం సర్దేశాను.. ఇక ఈ సిటీని వదిలే సమయం వచ్చింది. నిజం చెప్పాలంటే ప్రాణం పోతున్నట్టు ఉంది అంటూ ఏడుస్తున్న ఎమోజిని షేర్ చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ అవుతున్న ఫోటోలు పంచుకున్న క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ సిటీ మీకు అంత నచ్చిందా అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే మృణాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇందులో ఈమె గ్లామర్ లుక్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. గ్లామర్ లుక్కులో విదేశీ వీధుల్లో తిరుగుతూ తెగ సందడి చేసింది. తనకు నచ్చిన ఫుడ్ తీసుకుంది. ఏది ఏమైనా మనకు నచ్చిన ప్రదేశాన్ని వదిలి వెళ్లాల్సి వస్తే ఎంత బాధ ఉంటుందో ప్రస్తుతం మృణాల్ కూడా అంతే బాధ అనుభవిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మృణాల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాక సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ తో పాటు రష్మిక మందన్న , జాన్వీ కపూర్ వంటి ఇతర తారలు కూడా భాగం కాబోతున్నారు. పైగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాపై అమ్మడి అంచనాలు పెట్టుకుంది. మరి ఈ సినిమాలోని పాత్ర ఈమెకు ఏ విధంగా విజయాన్ని అందిస్తుందో చూడాలి.
