Begin typing your search above and press return to search.

మృనాల్ నిజంగానే లవ్ లో బ్రేకప్ అయ్యారా.. అతడు ఎవరో తెలుసా?

టీవీ సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మృనాల్ ఠాగూర్ తెలుగులో 'సీతారామం' సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

By:  Madhu Reddy   |   16 Sept 2025 6:00 PM IST
మృనాల్ నిజంగానే లవ్ లో బ్రేకప్ అయ్యారా.. అతడు ఎవరో తెలుసా?
X

టీవీ సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మృనాల్ ఠాగూర్ తెలుగులో 'సీతారామం' సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తొలిసారి నేరుగా తెలుగులో చేసిన చిత్రం ఇది. వీరిద్దరికీ ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. అంతేకాదు మృనాల్ ఆ తర్వాత కాలంలో ఎన్నో పాత్రలలో నటించినా.. సీతారామం సినిమాలోని సీత పాత్ర అందించిన గుర్తింపు మరో పాత్ర అందివ్వలేదు అనడంలో సందేహం లేదు. అంతలా సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తెలుగులో 'హాయ్ నాన్న' అనే సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాలో నటించింది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ప్రస్తుతం అడివి శేషు హీరోగా నటిస్తున్న 'డెకాయిట్' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా మృనాల్ ఠాగూర్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పై ఊహించని కామెంట్లు చేసిన ఈమె.. ఆ తర్వాత మరో హీరోయిన్ బిపాషా బసు పై కూడా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

అయితే ఇప్పుడు తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె టీవీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే.. ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ శరద్ త్రిపాఠి తో రిలేషన్ లో ఉన్నట్లు గత సంబంధాన్ని ఇప్పుడు అభిమానులు కూడా గుర్తు చేసుకుంటున్నారు..నిజానికి గతంలో వీరిద్దరూ సీరియల్స్ లో చేస్తున్నప్పుడే ఒకరికొకరు ఇష్టపడి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ కాలక్రమేనా..వీరి బంధాన్ని ముగించుకున్నట్లు సమాచారం.

ఇక శరద్ త్రిపాఠి విషయానికి వస్తే.. కసౌతి జిందగీ కి, స్వరాగిణి, క్యూకీ సాస్ భీ కభీ బహు థీ వంటి టెలివిజన్ షోలకు స్క్రిప్టు రైటర్ గా పనిచేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు కూడా స్క్రిప్ట్ రైటర్ గా పనిచేయడం జరిగింది. అటు స్క్రిప్టులతో పాటు శరత్ పాటలు కూడా రాస్తారు. ఏక్తా కపూర్ తో వృత్తిపరమైన అనుబంధాలను కలిగి ఉన్నా.. ఇప్పుడు ఇద్దరూ కలిసి లేనప్పటికీ.. విడిపోవడం గురించి మాత్రం ఇంకా క్లారిటీగా చెప్పలేదు.దీంతో అభిమానులు వీరి మధ్య అసలు ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు అటు మృణాల్ ఠాగూర్.. ఇటు శరద్ త్రిపాఠి విడిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై కూడా క్లారిటీ లేకపోవడం గమనార్హం. మొత్తానికైతే ఈ జంట విడిపోవడం పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.