Begin typing your search above and press return to search.

మైత్రి చేతికి మిస్టర్ ప్రెగ్నెంట్.. బెస్ట్ ఛాయిస్

ఈ మూవీ నైజాం లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ మూవీ నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకోవడం విశేషం.

By:  Tupaki Desk   |   10 Aug 2023 11:27 AM GMT
మైత్రి చేతికి మిస్టర్ ప్రెగ్నెంట్.. బెస్ట్ ఛాయిస్
X

సయ్యద్ సోహెల్ టీవీ సీరియల్స్ తో తన కెరీర్ ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ క్రేజ్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు సోహెల్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అవి ఊహించినంత సక్సెస్ కాలేకపోయాయి. అయితే, ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. అదే మిస్టర్ ప్రెగ్నంట్.

పేరు మాత్రమే కాదు, స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉండటంతో ఈ మూవీపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటవల ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. అది కూడా కింగ్ నాగర్జున చేతుల మీదుగా కావడం విశేషం. ఈ ట్రైలర్ అందరికీ విపరీతంగా నచ్చింది. పిల్లలు కనడం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే దక్కిన వరం.

పురుషులు పిల్లలను కనడం అసాధ్యం. అలాంటిది ఈ మూవీలో సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ గా మారి ఓ బిడ్డకు జన్మనివ్వాలి అనుకుంటాడు. ఆ సమయంలో అతను ఎదుర్కొన పరిస్థితులు ఏంటి అనే కాథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఈ మూవీ ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా, ఈ మూవీ నైజాం లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ మూవీ నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకోవడం విశేషం. ఇంత పెద్ద సంస్థ ఈ మూవీని డిస్ట్రీబ్యూట్ చేస్తోంది అంటేనే, ఈ మూవీ లో కంటెంట్ ఎలా ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేయగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా చేశాడు.

ఇక, ఈ సినిమాలో, సుహాసిని మణిరత్నం, రజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష, అభిషేక్ రెడ్డి, స్వప్నిక కీలకపాత్రలు పోషించారు. శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రీన్‍ప్లే బాధ్యతలు నిర్వర్తించాడు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.