Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ ఆ సూపర్ హిట్ సినిమా రూట్ లో..!

ఈమధ్యనే మొదలైన మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి లేటెస్ట్ గా వాలెంటైన్స్ డే నాడు ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ చూస్తే అచ్చం ఇడియట్ సినిమాలో రవితేజలా అనిపించాడు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 8:16 AM GMT
మిస్టర్ బచ్చన్ ఆ సూపర్ హిట్ సినిమా రూట్ లో..!
X

పూరీ జగన్నాథ్ సినిమాలకు ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. ఆయన సినిమాల్లో హీరోలు హీరోయిన్స్ ని విపరీతంగా టీజ్ చేస్తుంటారు. లోపల ఉన్న ప్రేమను చూపించకుండా హీరోయిన్స్ ని అలా టీజ్ చేస్తూ ప్రేమించడం అనేది పూరీ టేకింగ్ లో స్పెషల్ స్టైల్. పూరీ తీసిన సినిమాల్లో ఇది అబ్సర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా పూరీ రవితేజ కాంబో సినిమాల్లో ఈ టైప్ సీన్స్ బాగా కనిపిస్తాయి. అయితే రవితేజ పూరీ కలిసి పనిచేసి చాలా ఏళ్లు అవుతుంది. ఈ కలయిక కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే రవితేజ కూడా ఈమధ్య లవ్ స్టోరీస్ వదిలేసి భారీ సినిమాలు చేస్తున్నాడు. హీరోయిన్స్ తో రొమాన్స్, డ్యుయెట్స్ ఉంటున్నా పూరీ మార్క్ టీజింగ్ సీన్స్ మిస్ అవుతున్నాయి. అయితే హరీష్ శంకర్ ఆ లోటుని తీర్చే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో ఇలాంటి హీరోయిన్ టీజింగ్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది.

ఈమధ్యనే మొదలైన మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి లేటెస్ట్ గా వాలెంటైన్స్ డే నాడు ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ చూస్తే అచ్చం ఇడియట్ సినిమాలో రవితేజలా అనిపించాడు. ఆ సినిమాలో రక్షిత నడుముని వదలకుండా పట్టుకున్నట్టుగా మిస్టర్ బచ్చన్ సినిమా పోస్టర్ లో హీరోయిన్ భవ్య శ్రీ బోర్స్ ని కౌగిలించుకున్నాడు రవితేజ. సినిమా కథ లవ్ స్టోరీనా కాదా అన్నది పక్కన పెడితే రవితేజ మార్క్ హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ ఉంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

హరీష్ శంకర్ రవితేజ ఇద్దరు మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ మిరపకాయ్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ మాస్ రాజా ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి. డైరెక్టర్ గా హరీష్ శంకర్ కి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరో తోడైతే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మరి మిస్టర్ బచ్చన్ ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. రీసెంట్ గా ఈగల్ సినిమాతో ఫ్యాన్స్ ముందుకొచ్చిన రవితేజ మిస్టర్ బచ్చన్ తో ఇయర్ ఎండింగ్ కి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా వెల్లడించలేదు.