Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ కి అదే హైలెట్ కానుందట

ఈ సినిమాలో రవితేజ మాస్ అండ్ యాక్షన్‌ నటన సినిమాకు హైలైట్‌ అవ్వబోతున్నట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 12:30 PM GMT
మిస్టర్ బచ్చన్ కి అదే హైలెట్ కానుందట
X

రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన ఈగల్‌ సినిమా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. పాన్ ఇండియా రేంజ్ లో కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ రవితేజ మరోసారి ఫ్యాన్స్ ని మరియు ప్రేక్షకులను నిరాశ పరిచాడు.

ప్రస్తుతం అందరి దృష్టి కూడా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్‌ సినిమా పై ఉంది. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ రైడ్‌ కి ఇది రీమేక్ అనే విషయం అధికారికంగానే ప్రకటించారు. ఒక వైపు హిందీలో రైడ్‌ కి సీక్వెల్‌ రూపొందుతూ ఉంటే మరో వైపు తెలుగు లో సీక్వెల్‌ రూపొందుతోంది.

ప్రభుత్వ ఆఫీసర్‌ గా రవితేజను ఈ సినిమాలో చూడబోతున్నాం. రైడ్‌ కథాంశంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి మిస్టర్ బచ్చన్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో రవితేజ మాస్ అండ్ యాక్షన్‌ నటన సినిమాకు హైలైట్‌ అవ్వబోతున్నట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రవితేజ ఈ సినిమాలో తన నిజ వయసుకు కాస్త అటు ఇటుగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన దర్శకుడు హరీష్ శంకర్‌ త్వరలోనే మరో షెడ్యూల్‌ ను కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని చితర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

గతంలో రీమేక్ చేసి హిట్‌ కొట్టిన రికార్డ్‌ ఉన్న హరీష్ శంకర్‌ ఈ సినిమా తో రవితేజకు హిట్ ఇవ్వడం ఖాయం అన్నట్లుగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. పవన్ తో చేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ను మధ్యలో ఉంచి రవితేజ తో ఈ సినిమాను దర్శకుడు చేస్తున్నాడు. ఏపీ లో ఎన్నికలు పూర్తి అయ్యేప్పటికి మిస్టర్ బచ్చన్‌ ను ముగించి, ఆ తర్వాత ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ను పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.