Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా ఇకపై 10 దాటడం కష్టమేనా...!

థియేటర్ రిలీజ్ తర్వాత వంద రోజులు పూర్తి అయితేనే టీవీ టెలికాస్ట్‌ చేయాలని కూడా కొందరు డిమాండ్‌ చేస్తూ ఉండేవారు

By:  Tupaki Desk   |   18 April 2024 9:26 AM GMT
తెలుగు సినిమా ఇకపై 10 దాటడం కష్టమేనా...!
X

ఒకప్పుడు సినిమా థియేటర్లలో మాత్రమే సినిమాలు చూసే వీలు ఉండేది. మూడు దశాబ్దాలుగా టీవీల్లో సినిమాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. టీవీలు వచ్చిన కొత్తలో సినిమాలు విడుదల అయిన చాలా నెలల తర్వాత కానీ టెలికాస్ట్‌ అయ్యేవి కాదు. కానీ ఆ తర్వాత తర్వాత థియేటర్‌ రిలీజ్ అయిన 50 రోజుల లోపే టీవీల్లో చూసే అవకాశం ఉండేది.

థియేటర్ రిలీజ్ తర్వాత వంద రోజులు పూర్తి అయితేనే టీవీ టెలికాస్ట్‌ చేయాలని కూడా కొందరు డిమాండ్‌ చేస్తూ ఉండేవారు. టీవీల్లో సినిమాలకు విపరీతమైన టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చేది. అల వైకుఠపురంలో సినిమాకు 29.4 రేటింగ్‌ దక్కగా, సరిలేరు నీకెవ్వరు సినిమాకు 23.5 రేటింగ్‌ దక్కింది.

అప్పట్లో స్టార్‌ హీరోల సినిమాలకు పదికి తగ్గకుండా రేటింగ్‌ వచ్చేది. ఎన్ని సార్లు టెలికాస్ట్‌ చేసినా కూడా మినిమం రేటింగ్‌ వస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతటి హిట్‌ మూవీ అయినా 10 రేటింగ్‌ దాటడం లేదు. అందుకు కారణం ఓటీటీ స్ట్రీమింగ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఇండియాలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. థియేటర్ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు దాదాపుగా ఓటీటీ లో చూస్తున్నారు. అతి తక్కువ మంది మాత్రమే ఆ సినిమాలను శాటిలైట్‌ ఛానల్‌ లో వచ్చినప్పుడు చూస్తున్నారు.

హిట్‌ టాక్ దక్కించుకున్న వాల్తేరు వీరయ్య కి 5.14 రేటింగ్‌ దక్కింది. ఇటీవల టెలికాస్ట్‌ అయిన గుంటూరు కారం సినిమాకు 9.23 టీఆర్‌పీ రేటింగ్‌ నమోదు అయ్యింది. ఈ మధ్య కాలంలో ఇంతటి రేటింగ్‌ దక్కించుకున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు మరియు హిందీ సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా శాటిలైట్‌ లో టెలికాస్ట్‌ అయినప్పుడు 10 రేటింగ్‌ రావడం అనేది గగనంగా మారింది. భవిష్యత్తులో మరింతగా ఓటీటీ కి ప్రేక్షకులు అతుక్కు పోతారు. కనుక ఎంతటి పెద్ద విజయం సాధించిన సినిమా కూడా 10 రేటింగ్‌ దాటం దాదాపు అసాధ్యం అనేది విశ్లేషకుల మాట.