Begin typing your search above and press return to search.

అక్కడ సినిమా టికెట్‌ రేటు @రూ.30!

గడచిన పదేళ్లలో సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగాయి.

By:  Tupaki Desk   |   25 April 2024 5:08 AM GMT
అక్కడ సినిమా టికెట్‌ రేటు @రూ.30!
X

గడచిన పదేళ్లలో సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. సౌత్ ఇండియాతో పాటు నార్త్‌ ఇండియాలో కూడా భారీగా పెరిగిన టికెట్ల రేట్ల కారణంగా గతంలో మాదిరిగా జనాలు థియేటర్లకు వెళ్లాలి అంటే భయపడే పరిస్థితి ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో థియేటర్లకు జనాలు వెళ్లడం అనేది చాలా తక్కువ అయ్యింది.

సినిమా విడుదల అయిన మొదటి వారం లేదా రెండు వారాల పాటు ప్రేక్షకులు థియేటర్లకు కొందరు వెళ్తున్నారు. మల్టీప్లెక్స్ లో ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలి అంటే రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను థియేటర్‌ లో కంటే ఓటీటీ లో చూడటం ఉత్తమం అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

సౌత్ ఇండియాలో థియేటర్లకు జనాలు కొంతమంది అయినా వస్తున్నారు. కానీ ఉత్తర భారతంలో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ హిట్‌ టాక్ వచ్చిన సినిమాలకు కూడా వంద కోట్ల వసూళ్లు నమోదు అవ్వని పరిస్థితి. స్టార్‌ హీరోల సినిమాలు, క్రేజీ సినిమాలు కూడా పాతిక నుంచి ముప్పై కోట్ల వసూళ్లు మాత్రమే రాబడుతున్నాయి.

థియేటర్ల మెయింటెన్స్ కి సరిపోను కూడా డబ్బు రావడం లేదని ఎగ్జిబీటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సింగిల్‌ స్క్రీన్ థియేటర్లు మూత పడ్డాయి. కొన్నింట టికెట్ల రేట్లు తగ్గించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో మాదిరిగా చాలా థియేటర్లు తక్కువ రేటుకు టికెట్లను ఇవ్వడం ద్వారా కనీసం మెయింటెన్స్‌ అయినా వస్తుందని థియేటర్‌ యాజమన్యాలు భావిస్తున్నాయి. ఆగ్రా తో పాటు రాజస్థాన్‌ లోని పలు థియేటర్లలో రూ.30 లకే టికెట్లను ఇస్తున్నారు.

భవిష్యత్తులో మల్టీప్లెక్స్ లు కూడా వాటి టికెట్ల రేట్లు తగ్గించే పరిస్థితులు రావచ్చు. ప్రస్తుతానికి సింగిల్‌ స్క్రీన్ థియేటర్లు మూత పడుతున్నాయి. కానీ ముందు ముందు రోజుల్లో మల్టీప్లెక్స్‌ లకు కూడా గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు మారాలంటే మేకింగ్‌ ఖర్చులు తగ్గాలి, టికెట్ల రేట్లు తగ్గాల్సిన అవసరం ఉంది.