Begin typing your search above and press return to search.

షో క్యాన్సిల్.. 100 టిక్కెట్లు కొన్న సినిమా యూనిట్!

తాజాగా ఈవారం రిలీజ్ అయిన ఓ సినిమాకి ఇదే పరిస్థితి ఎదురయింది. ఈ వారం ఓ సినిమా రిలీజ్ అయింది

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:58 AM GMT
షో క్యాన్సిల్.. 100 టిక్కెట్లు కొన్న సినిమా యూనిట్!
X

ప్రతి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు విడుదలవుతుంటాయి. వాటిలో కొన్ని సినిమాలు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటే మరికొన్ని సినిమాలు కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ పెద్దగా హైప్ ఉండకపోవడంతో వాటిపై ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. అలాంటి సినిమాలను థియేటర్లకి వెళ్లి మరీ చూడటం ఎందుకని ఓటీటీలో చూసుకోవడమే బెస్ట్ ఆప్షన్ గా పెట్టుకుంటారు. అలా ఈ మధ్య కొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన కూడా జనాలు రాకపోవడంతో షోలు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా ఈవారం రిలీజ్ అయిన ఓ సినిమాకి ఇదే పరిస్థితి ఎదురయింది. ఈ వారం ఓ సినిమా రిలీజ్ అయింది. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఓ నగరంలో మార్నింగ్ షో పడలేదు. అందుకు కారణం జనాలు థియేటర్స్ కి రాకపోవడమే. కేవలం ఇద్దరు మాత్రమే టికెట్ కొనడంతో షో వేయలేమని థియేటర్ యాజమాన్యం చేతులెత్తేసింది. జనాలు సినిమాకి రాలేదంటే సినిమా బాలేదని కాదు. సినిమా బాగానే ఉంది. కానీ మీడియా నుండి రెస్పాండ్ సరిగ్గా లేదనే భావనలో ఉన్నారు సినిమా మేకర్స్.

ఇలాంటి సమయంలో ఈ న్యూస్ కాస్త చిత్ర బృందం వరకు చేరింది. దాంతో మరునాడు ఉదయం సినిమా యూనిట్ నుంచి ఒకర్ని ఆ థియేటర్ కి పంపించి 100 టికెట్లు కొనిపించారు. నిజానికి ఆ మరునాడు కూడా షో క్యాన్సిల్ చేయాలని థియేటర్ యాజమాన్యం అనుకున్నారు అలాంటి సమయంలో 100 టికెట్ల బేరం వచ్చింది. దాంతో థియేటర్లో మార్నింగ్ షో వేశారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ 100 టికెట్లు ఎవరికిచ్చారు? ఏం చేశారనేది? అనేది ఎవరికి తెలియదు.

థియేటర్లో చూస్తే పెద్దగా జనాలు లేరు. అంటే కేవలం షో క్యాన్సిల్ అయిందనే అపప్రద నుండి తప్పించుకోవడానికి మూవీ టీం ఆ 100 టికెట్లను ఖర్చు చేసిందన్నమాట. నిజానికి ఇది సినిమాలకు సరైన సీజన్ కాదు. ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజెంట్ ఫెస్టివల్ షాపింగ్ నడుస్తోంది. జనాల దృష్టి షాపింగ్ నుంచి సినిమా మీదికి వెళ్లాలంటే ఆ సినిమాకి భారీ హైప్ తో పాటు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా ఉండాలి. అలా లేకపోతే ఇలానే సినిమా యూనిటే తమ టికెట్లను కొనే పరిస్థితి వస్తుంది.