Begin typing your search above and press return to search.

ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

అలా ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాయి.

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:30 AM GMT
ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
X

ప్రతి వారం థియేటర్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లోకి ప్రేక్షకులని ఎంటెర్టైన్ చేయడానికి వస్తూ ఉంటాయి. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయిన హిట్, ఫ్లాప్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతూ ఉంటాయి. అలా ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాయి.

సెప్టెంబర్ 15న కార్తీక్ రత్నం హీరోగా సతీష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఛాంగురే బంగారు రాజా మూవీ రిలీజ్ కాబోతోంది. రవితేజ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అలాగే విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ మార్క్ ఆంటోనీ అదే రోజు రిలీజ్ కాబోతోంది. రామన్న యూత్ అనే ఓ చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కమల కామరాజు లీడ్ రోల్ లో రఘుపతి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సోదర సోదరీమణులారా మూవీ కూడా సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతోంది.

ఇక డిజిటల్ స్పేస్ లోకి వస్తే నెట్‌ఫ్లిక్స్‌ లో వైఫ్‌లైక్‌ సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెజ్లర్స్‌ వెబ్‌సిరీస్‌ సెప్టెంబరు 13 న రిలీజ్ కాబోతోంది. గోపీచంద్ రామబాణం మూవీ సెప్టెంబరు 14 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఎ మిలియన్‌ మైల్స్‌ ఎవే హాలీవుడ్ మూవీ సెప్టెంబరు 15న విడుదల అవ్వనుంది. మిసెడ్యుకేషన్‌ అనే వెబ్‌సిరీస్ సెప్టెంబరు 15 నుంచి ప్రసారం కానుంది.

హిందీ మూవీ శ్రీ సెప్టెంబరు 15 నుంచి లైవ్ లోకి రాబోతోంది. మెగాస్టార్ భోళా శంకర్‌ మూవీ సెప్టెంబరు 15 ఓటీటీలో రిలీజ్ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ లో హాలీవుడ్‌ మూవీ కెల్సే సెప్టెంబరు 12 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ది కిడ్నాపింగ్‌ డే అనే మూవీ సెప్టెంబర్ 12 నుంచి అందుబాటులో ఉంటుంది.

ఇవి మాత్రమే కాకుండా ఇతర భాషలకి చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. వీటిలో ఎన్ని డిజిటల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయనేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే మార్క్ ఆంటోనీపై ఎక్కువ హైప్ ఉంది.