Begin typing your search above and press return to search.

ఈ ఏడాదైనా ఆ సినిమాలు ఓటీటీలో కనిపిస్తాయా?

కొన్ని పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి హై ఎక్స్ పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంటూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   27 March 2024 4:16 AM GMT
ఈ ఏడాదైనా ఆ సినిమాలు ఓటీటీలో కనిపిస్తాయా?
X

కొన్ని పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి హై ఎక్స్ పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంటూ ఉంటాయి. ప్రేక్షకులు యునానమస్ గా తిరస్కరించిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి కథలపై నిర్మాతలు అన్ని కోట్ల బడ్జెట్ ఎలా పెట్టారు.. అసలు హీరోలు ఏం చూసి మూవీకి ఒకే చెప్పారు అనే విషయాలు కూడా ఆడియన్స్ కి అర్ధం కావు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలలో కొన్ని ఇప్పటికి ఓటీటీలో రిలీజ్ కాలేదు. డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు ఆ సినిమాలని ఓటీటీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపించకపోవడం వలన ఆ మూవీస్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. అలాగే డిజిటల్ కంపెనీలు ఆఫర్ చేసే మనీకి నిర్మాతలు ప్రాజెక్ట్ ని ఇవ్వలేక ఆగిపోయినవి కొన్ని ఉన్నాయి. ఇక 2023లో వచ్చిన సినిమాలు కొన్ని ఇప్పటికి ఓటీటీ లో దర్శనమివ్వడం లేదు.

తెలుగు అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ఏజెంట్. ఈ సినిమాకి 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేసారంట. అయితే సరైన కథ లేకపోవడం, రిలీజ్ ప్లానింగ్ పెర్ఫెక్ట్ గా చేయకపోవడం వలన మూవీపైన ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు. థియేటర్స్ లోకి రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.

హీరో, నిర్మాత ఆడియన్స్ కి సినిమా ఫెయిల్యూర్ కి బాధ్యత వహిస్తూ సారీ కూడా చెప్పారు. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై రెండు, మూడు సార్లు అప్డేట్ ఇచ్చిన కూడా ఎందుకనో ఇప్పటికి అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ మూవీతో నిర్మాత అనిల్ సుంకర భారీ నష్టాన్ని చవిచూశారు. హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన గణపత్ మూవీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

ఈ సినిమా కూడా డిజిటల్ రిలీజ్ కాలేదు. ఇక విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జోడీగా వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ జర హత్ కే జర బచ్ కే మూవీ కూడా గత ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కూడా ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. అలాగే మలయాళంలో నవీన్ పోలీ చేసిన బాస్ మూవీ కూడా ఓటీటీలో ఇంకా రిలీజ్ చేయలేదు. ఇవన్నీ స్టార్ క్యాస్టింగ్ ఉన్న కూడా ప్రోడక్ట్ వేల్యూ లేకపోవడం వలన డిజిటల్ రైట్స్ అమ్ముడుపోలేదని తెలుస్తోంది. మరి 2024 లో అయినా ఈ సినిమాలను ఓటీటీ లో కనిపిస్తాయో లేదో చూడాలి.