Begin typing your search above and press return to search.

2024లో సీక్వెల్స్ హవా.. వ్వాటే కాంబినేషన్స్

ఒక సినిమా సక్సెస్ అయితే వాటికి సీక్వెల్స్ ప్లాన్ చేయడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపొయింది

By:  Tupaki Desk   |   17 Dec 2023 4:54 AM GMT
2024లో సీక్వెల్స్ హవా.. వ్వాటే కాంబినేషన్స్
X

ఒక సినిమా సక్సెస్ అయితే వాటికి సీక్వెల్స్ ప్లాన్ చేయడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపొయింది. సక్సెస్ వచ్చిన మూవీకి సీక్వెల్ చేయడం వలన భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో కూడా ఈ సీక్వెల్స్ బాగా వర్క్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ట్రెండ్ ని ఫాలో అవుతూ సీక్వెల్స్ చేస్తున్నారు.

సౌత్ లో ఎక్కువ బజ్ ఉన్న సీక్వెల్స్ అన్ని కూడా 2024లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఐకాన్ స్టార్ పుష్ప 2 మూవీ ఆగష్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. అలాగే శంకర్ ఇండియన్ 2 సినిమాపైనే కూడా ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. వీటి తర్వాత రిషబ్ శెట్టి కాంతారా 2 మూవీపైన కూడా అంచనాలు హెవీగానే ఉన్నాయి.

ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మరో అరడనుకి పైగా సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటిలో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఉంది. ఈ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. అలాగే ఆర్జీవీ వ్యూహం 2 కూడా జనవరి 26న రిలీజ్ కాబోతోంది.

మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర 2 కూడా సిద్ధం అవుతోంది. 2019 ఎన్నికలకి ముందుకి వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు జగన్ జర్నీతో యాత్ర 2 సిద్ధం అవుతోంది. ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. వీటితో పాటు సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న టిల్లు స్క్వేర్ ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వబోతోంది. డీజే టిల్లుకి సీక్వెల్ గా ఈ మూవీ రెడీ అవుతోంది.

అడవి శేషు గూఢచారి 2 మూవీ కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. వీటితో పాటు మత్తు వదలరా మూవీకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇలా మొత్తం 10కి పైగా సీక్వెల్స్ 2024లో థియేటర్స్ లోకి రానున్నాయి. వీటిలో ఎన్ని సక్సెస్ అందుకొని నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తాయనేది చూడాలి.