Begin typing your search above and press return to search.

ముందు చెప్పేవి కొన్నైతే.. చివరికి ట్విస్ట్ ఇచ్చేవి మరికొన్ని..!

బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చినప్పటి నుంచి ఏదైనా కథ ఒక సినిమాగా చెప్పడం కుదరకపోతే రెండు భాగాలుగా చెప్పొచ్చు అనే ఆలోచన వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 4:30 PM GMT
ముందు చెప్పేవి కొన్నైతే.. చివరికి ట్విస్ట్ ఇచ్చేవి మరికొన్ని..!
X

బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చినప్పటి నుంచి ఏదైనా కథ ఒక సినిమాగా చెప్పడం కుదరకపోతే రెండు భాగాలుగా చెప్పొచ్చు అనే ఆలోచన వచ్చింది. బాహుబలి తర్వాత ఇదే ప్రయోగం చేశాడు కె.జి.ఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్. కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలు కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంతో ఈ సీక్వెల్ కథలకు సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప కూడా ఇదే పంథా కొనసాగించారు. సుకుమార్ అల్లు అర్జున్ కలిసి చేసిన పుష్ప మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వగా సెకండ్ పార్ట్ కోసం ఈగర్ గా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

పుష్ప తో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ఇదే సీక్వెల్ బాట పట్టాయి. అయితే ఈ క్రమంలో కొన్ని సినిమాలు కథను పూర్తి చేసి సీక్వెల్ ప్లాన్ చేస్తుంటే కొన్ని కథలు మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటున్నాయి. ఎన్.టి.ఆర్ దేవర ముందుగానే రెండు భాగాలని అనౌన్స్ చేశారు. ప్రభాస్ సలార్ కూడా రెండు భాగాలుగా వస్తుంది. మొదటి పార్ట్ రీసెంట్ గా వచ్చి సక్సెస్ అవ్వగా సెకండ్ పార్ట్ మరో ఏడాది టైం పట్టేలా ఉంది.

బాహుబలి, కె.జి.ఎఫ్, పుష్ప, సలార్ ఇదే పంథాలో వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన రవితేజ ఈగల్ కూడా ఇదే బాటలో నడిచింది. ఈగల్ సినిమా సినిమా పూర్తయ్యే వరకు సినిమా రెండు భాగాలని తెలియదు.

ఈగల్ రెండో భాగం యుద్ధకాండ గా తెరకెక్కిస్తున్నారు. రవితేజ ఈగల్ సెకండ్ పార్ట్ లోనే అసలు కథ ఉంటుందని తెలుస్తుంది. ఇలా సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చి రెండో భాగం అని చెప్పడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. అయితే ముందు చెప్పి సినిమా రెండు భాగాలని ఆడియన్స్ ని కన్విన్స్ చేయడం కొందరు చేస్తుంటే సినిమా చివర్లో దీనికి రెండో భాగం ఉంటుందని ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడం కొందరు చేస్తున్న పని. అయితే తమకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ సినిమాను ఎన్ని భాగాలుగా తీసినా మాకు ఓకే అనేస్తున్నారు ఆడియన్స్.

అయితే మొదటి భాగం హిట్ అయితేనే రెండో భాగం తీయాలని చేసే కొన్ని సినిమాలు ఉన్నాయి. పెదకాపు 1 సినిమా మొదటి భాగం భారీగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా కొనసాగింపు ఉంటుందా అన్న డౌట్ ఉంది. ఇదే కాదు ఇలా రెండు భాగాలు అన్ని చెప్పి సినిమా చేసిన మరికొన్ని సినిమాలు కూడా మొదటిది వర్క్ అవుట్ అవ్వక వదిలేసిన సందర్భాలు ఉన్నాయి.