Begin typing your search above and press return to search.

ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు.. ఇది రన్ టైమ్!

డిసెంబర్ 24న తెలుగు, తమిళం నుంచి ఏకంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:19 AM GMT
ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు.. ఇది రన్ టైమ్!
X

డిసెంబర్ 24న తెలుగు, తమిళం నుంచి ఏకంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. స్ట్రైట్ తెలుగు సినిమాలైన ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ సినిమాలు మంచి బజ్ తోనే రిలీజ్ అవుతున్నాయి. వైష్ణవ్ తేజ్ హీరోగా ఆదికేశవ వస్తోంది. శ్రీకాంత్, శివాని లీడ్ రోల్ లో కోటబొమ్మాళి పీఎస్ వస్తోంది. అలాగే గౌతమ్ మీనన్ చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన దృవ నక్షత్రం కూడా రిలీజ్ అవుతోంది.

ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. కేవలం చియాన్ విక్రమ్ ఇమేజ్ తోనే థియేటర్స్ లోకి వస్తోంది. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. ఆమె కూడా పెద్దగా సినిమాని ప్రమోట్ చేయడం లేదు. చాలా ఏళ్ల క్రితం చేసిన మూవీ కావడంతో కేవలం దర్శకుడు గౌతమ్ మీనన్ మాత్రమే దృవ నక్షత్రం రిలీజ్ వ్యవహారం అంతా చూసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలు మూడు సెన్సార్ అయిపోయాయి. ఆదికేశవ సినిమాకి సెన్సార్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీ రన్ టైం 2 గంటల 9 నిమిషాలు. ఇక కోటబొమ్మాళి పీఎస్ కి యూ/ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా 2 గంటల 18 నిమిషాల నిడివితో ఉంది. విక్రమ్ ధృవ నక్షత్రం యూ/ ఏ సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైంని 2 గంటల 25 నిమిషాలకి లాక్ చేశారు.

సినిమాలలో స్టార్ క్యాస్టింగ్ ఉన్న థియేటర్స్ కి భారీగా ప్రేక్షకులని రప్పించి సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టే స్థాయిలో ఈ మూవీస్ కి బజ్ లేదు. కాని కంటెంట్ ఉంటే మాత్రం మౌత్ టాక్ తో జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి పబ్లిక్ అటెన్సన్ ని ఈ మూడింటిలో ఏది గ్రాబ్ చేస్తుందనేది చూడాలి.

చియాన్ విక్రమ్ నుంచి పొన్నియన్ సెల్వన్ 2 తర్వాత వస్తోన్న సినిమా ఇదే కావడంతో తమిళనాట కొంత బజ్ ఉంది. తెలుగులో కూడా ఉన్న పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన రిలీజ్ విషయం కూడా చాలా మందికి తెలియదు.