Begin typing your search above and press return to search.

పుష్ప 2 రాకుంటే.. ఆ సినిమా కూడా దిగిపోద్ది..?

అయితే పుష్ప 2 ఆగస్టు 15న రాకపోతే మాత్రం ఆ డేట్ కోసం మిగతా సినిమాలు కాచుకొని ఉన్నాయి.

By:  Tupaki Desk   |   13 Feb 2024 11:30 PM GMT
పుష్ప 2 రాకుంటే.. ఆ సినిమా కూడా దిగిపోద్ది..?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అని చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇదివరకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చేసిందే. సినిమా విడుదలకు ఇంకా 200 రోజుల సమయం ఉంది అంటూ ఒక స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

దీంతో సినిమా ఆగస్టు 15న అనుకున్న సమయానికి రాబోతోంది అని మరోసారి ఫ్యాన్స్ కి క్లారిటీ అయితే వచ్చేసింది. అయినప్పటికీ కూడా సుకుమార్ అతి జాగ్రత్త వలన సినిమా వాయిదా పడడం పక్క అని ఇండస్ట్రీలో కొత్త తరహా గాసిప్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రమోషన్స్ కోసం కూడా ఈసారి ఎక్కువ సమయం కేటాయించాలి అని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది.

ఎందుకంటే ఫస్ట్ పార్ట్ సమయానికి సుకుమార్ కూడా ప్రమోషన్స్ లో అందుబాటులో కి రాలేదు. నార్త్ లో కూడా కేవలం ప్రెస్ మీట్ తో మాత్రమే సరిపెట్టారు. కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి అని చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్ కూడా అనుకున్న సమయానికి ఫినిష్ అవుతుందా లేదా అనేది మరొక పెద్ద సందేహం. అయితే పుష్ప 2 ఆగస్టు 15న రాకపోతే మాత్రం ఆ డేట్ కోసం మిగతా సినిమాలు కాచుకొని ఉన్నాయి.

ఇప్పటికే దేవర ఏప్రిల్ నుంచి తప్పుకోగా మొదటి ఆప్షన్ గా ఆగస్టు 15ని టార్గెట్ చేసింది. అలాగే నాగచైతన్య చందు మొండేటి కాంబినేషన్లో రాబోతున్న తండేల్ కూడా ఆ డేట్ ను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచనతో ఉంది. ఇక రీసెంట్గా మరో హీరో కూడా ఆగస్టు 15 పై ఫోకస్ పెంచినట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సరిపోదా శనివారం.. అనే సినిమా ఆగస్టు 15నకు రిలీజ్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు.

అయితే పుష్ప 2 రాకపోతేనే ఆ డేట్ కు రావాలి అని అనుకుంటున్నారు. లేదంటే ఆగస్టు 29 బెస్ట్ ఆప్షన్ గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను మాత్రం ఆగస్టులోనే విడుదల చేయాలి అని నిర్మాత దానయ్య అనుకుంటున్నారు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా చాలా వరకు క్లోజ్ అయ్యాయి. మరి నాని సరిపోదా శనివారంకు పుష్ప 2 డేట్ లభిస్తుందో లేదో చూడాలి.