Begin typing your search above and press return to search.

ఆ హీరో చీటింగ్ చేస్తున్నాడా?

అభిమానులు హీరోల్ని ఎంత‌గా అభిమానిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. దైవ స‌మానంగా భావిస్తుంటారు

By:  Tupaki Desk   |   20 March 2024 9:20 AM GMT
ఆ హీరో చీటింగ్ చేస్తున్నాడా?
X

అభిమానులు హీరోల్ని ఎంత‌గా అభిమానిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. దైవ స‌మానంగా భావిస్తుంటారు. అభిమానుల ప‌ట్ల కొంద‌రు హీరోలు కూడా అంతే ప్రేమ‌ని చాటుతుంటారు. ముఖ్యంగా ఈ ర‌క‌మైన బాండింగ్ తెలుగు..త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో క‌నిపిస్తుంటుంది. హీరోల కోసం అభిమానులు త‌న్నుకోవ‌డం ఎన్నోసార్లు చూసాం. హీరోల‌కు ఫోటోల‌కు పాలాభీషేం..క్షీరాభిషేకం చేయ‌డం ఎన్నోసార్లు జ‌రిగింది.

ఈ ర‌కమైన అభిమానం కేవ‌లం ఈ రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోనే క‌నిపిస్తుంటుంది. మ‌రి అలాంటి అభిమ‌నం చోటు చేసుకున్న చోట ఓ హీరో ఏం చేసాడో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వివ‌రాల్లోకి వెళ్తే ఓ స్టార్ హీరో ఇటీవ‌లే ఓ హిట్ చిత్రాన్ని సీక్వెల్ ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ చిత్రానికి తానే స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్నాడు. ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం కూడా ఓ డ్రీమ్ గా చెప్పుకొచ్చాడు.

అయితే ఇదే సినిమా గురించి కొన్నినెల‌ల క్రిత‌మే చ‌ర్చ‌కొచ్చింది. నెట్టింట అభిమానుల‌తో ఇంట‌రాక్ష‌న్ లో భాగంగా ఆ సినిమా గురించి అడిగితే షూటింగ్ కూడా పూర్త‌యింద‌ని..పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతు న్నయ‌ని తెలిపాడు. అప్ప‌టికే ఆ ప్రాజెక్ట్ ప్రారంభ‌మై సెట్స్ లో ఉంద‌ని ప్ర‌చారం సాగింది. బాగా డిలే అవుతున్న‌ట్లు అభిమానులు భావించారు. ఈ నేప‌థ్యంలో డిస్క‌ష‌న్ లో భాగంగా ఓ అభిమాని ఆ సినిమా గురించి అడిగాడు. అప్పుడొచ్చిన స‌మాధానాలే అవ‌న్నీ.

అయితే తాజాగా అదే ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. అత‌డు ఆ సినిమా డైరెక్ట్ చేస్తున్న‌ట్లు ఏడాది కాలంగా మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంది. కానీ అదే విష‌యాన్ని స‌ద‌రు హీరో కొత్త‌గా చెప్ప‌డం చ‌ర్చ‌కు దారి తీస్తుంది. దీంతో ఆసినిమా అస‌లు ఇప్ప‌టివ‌ర‌కూ మొద‌లు కాలేదా? లేక అవ‌స‌ర‌మైన రీ షూట్ ని ప్లాన్ చేసి ఇలా మార్చి చెబుతున్నారా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌స్తున్నాయి.

అయితే ఆ సినిమాని హిట్ చేయాల్సిన బాధ్య‌త హీరోపై ఉంది. ఎందుకంటే ఆ సీక్వెల్ ని కూడా మాతృక‌ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడే రూపొందిస్తాడ‌ని ప్ర‌చారం సాగింది. కానీ అత‌డు త‌ప్పుకోవ‌డంతో హీరోగా కెప్టెన్ కుర్చీ ఎక్కి... ఆ బాధ్య‌త‌ని ఓసవాల్ గా భావించి ముందుకెళ్తున్నాడు. ఈ అంశంపై కోలీవుడ్ లో మీడియా లో కూడా చ‌ర్చ‌కొస్తుంది.