Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: బెంగాల్‌లో మ‌న స్టార్ల హ‌వా

భారతీయ సినిమా రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ వంటి దిగ్గజ న‌టుల‌ను కీర్తించింది. వారికి దేశ‌వ్యాప్తంగా ప్ర‌జాద‌ర‌ణ ఉంది

By:  Tupaki Desk   |   2 Oct 2023 2:30 PM GMT
ట్రెండీ స్టోరి: బెంగాల్‌లో మ‌న స్టార్ల హ‌వా
X

భారతీయ సినిమా రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ వంటి దిగ్గజ న‌టుల‌ను కీర్తించింది. వారికి దేశ‌వ్యాప్తంగా ప్ర‌జాద‌ర‌ణ ఉంది. అమితాబ్‌తో పాటు వారిని దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు గుర్తు ప‌డ‌తారు. వీరంతా ద‌శాబ్ధాల పాటు సినీరంగాన్ని ఏలారు. ఇంకా ఏల్తూనే ఉన్నారు. అయితే కొత్త తరం దక్షిణాది హీరోల్లో దేశవ్యాప్తంగా ఇంటి పేర్లుగా వెలుగొందుతున్న‌ది ఎంద‌రు? ద‌క్షిణాది యువా స్టార్లు ఎంద‌రికి ఉత్త‌రాదిన ఫాలోయింగ్ ఉంది? ముఖ్యంగా కోల్ క‌తా- ప‌శ్చిమ బెంగాళ్ లో ఆద‌ర‌ణ పొందుతున్న ద‌క్షిణాది స్టార్లు ఎందరున్నారు? అన్న‌ది ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి.

మ‌న స్టార్లు తమదైన యూనిక్ నెస్.. ట్రేడ్‌మార్క్ స్టైల్ తో తెర‌ను వేడెక్కిస్తున్నారు. ద‌క్షిణాది ఉత్త‌రాది అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటున్నారు. భాష ప్రాంతం అనే స‌రిహ‌ద్దులు దాటి ముందుకు వెళుతున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే భారీ జ‌న‌సాంద్ర‌త క‌లిగిన‌ బెంగాల్‌లో కూడా సినీ ఔత్సాహికుల హృదయాలపై ఈ వర్ధమాన తారలు వేవ్స్ సృష్టిస్తున్నారు. నిజానికి పాన్ ఇండియా ట్రెండ్ ని తెచ్చిన ప‌లువురు తెలుగు స్టార్ల‌కు ఉత్త‌రాది భాష‌ల్లో ఇప్పుడు గొప్ప ఫాలోయింగ్ ఉంది. వీరికి త‌మిళం-మ‌ల‌యాళం-క‌న్న‌డం చాలా కామ‌న్.. కానీ ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌, క‌ల‌క‌త్తా- ప‌శ్చిమ‌బెంగాల్ వ్యాప్తంగా మ‌న స్టార్ల‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ప‌ర్య‌వ‌సానంగా బెంగాలీలు ఇప్పుడు తెలుగు స‌హా ఇత‌ర ద‌క్షిణాది స్టార్ల సినిమాల‌ను ఎంత‌గానో ఆద‌రిస్తున్నార‌ని స‌ర్వేలు క్లియ‌ర్ క‌ట్ గా చెబుతున్నాయి.

బెంగాళీలు గొప్ప‌గా ఆద‌రిస్తున్న స్టార్ల‌లో డార్లింగ్ ప్ర‌భాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఉన్నారు. క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ తో పాటు త‌మిళ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. బాహుబ‌లి స్టార్ గా ప్ర‌భాస్ ప్ర‌భావం దేశంలో అంతా ఇంతా కాదు. అత‌డికి బెంగాళ్ లోను అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. కేవ‌లం బాహుబ‌లి- బాహుబ‌లి 2 మాత్ర‌మే కాదు, సాహో స‌హా ప‌లు చిత్రాలు అక్క‌డ బాగా ఆడాయి. ప్ర‌భాస్ పాన్-ఇండియన్ అప్పీల్ సాహో -రాధే శ్యామ్- ఆదిపురుష్ వంటి చిత్రాలతో మరింత సుస్థిర‌మైందే కానీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

తెలుగు రాష్ట్రాలు స‌హా కేర‌ళ‌లో గొప్ప ఫాలోయింగ్ ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ప‌శ్చిమ‌బెంగాల్ లోను అసాధార‌ణంగా ఉంద‌ని స‌మాచారం. పుష్ప చిత్రంతో అత‌డి స్టార్ డ‌మ్ అమాంతం పెరిగింది. కోల్ క‌త‌- బెంగాళ్ వ్యాప్తంగా ఇప్పుడు బ‌న్ని ఎవ‌రో స్ప‌ష్ఠంగా తెలుసు. అత‌డు న‌టించే త‌దుప‌రి చిత్రాల‌కు ఇక్క‌డ గొప్ప ఆద‌ర‌ణ ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. పుష్ప‌రాజ్ గా అద్భుత‌మైన న‌ట‌న‌, డ్యాన్సులు, డైలాగ్స్ తో ఉత్త‌రాదినా త‌న‌కంటూ ఒక రేంజును సంపాదించుకున్నాడు. బ‌న్ని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌కు స‌రిపోయే ప‌ర్స‌నాలిటీ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టింది. అత‌డి ప్ర‌తిభ‌కు ఇటీవ‌ల ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ ద‌క్కింది. భారతీయ సినీరంగంలో ప్రియమైన స్టార్ గా ఆవిష్క‌రించింది. అల్లు అర్జున్ ఇంకా అధికారికంగా హిందీ రంగంలోకి ప్ర‌వేశించ‌క‌పోయినా కానీ, పాన్-ఇండియన్ స్టార్ గా గొప్ప ప్ర‌భావం చూపుతున్నాడు. ఇక బెంగాళ్ బెల్ట్ లోను అత‌డికి గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. బ‌న్ని న‌టిస్తున్న పుష్ప 2 కోసం ఉత్త‌రాది యావ‌త్తూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ముఖ్యంగా బెంగాళీలు కూడా.

రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ ల‌కు బెంగాల్ లో గొప్ప ఫాలోయింగ్ ఏర్ప‌డింది. బ్లాక్ బస్టర్ RRRలో స్వాతంత్య్ర యోధులుగా న‌టించి ఇద్దరు నటులు తమ స్టార్‌డమ్‌ను కొత్త ఎత్తులకు పెంచుకున్నారు. దిగ్గజ ద‌ర్శ‌కుడు S.S. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వారి అసాధారణమైన నటనా నైపుణ్యాలను ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని గొప్ప‌గా ఆవిష్క‌రించింది. వారి న‌ట‌న‌ భౌగోళిక సరిహద్దులను దాటి ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసింది. RRRలో వారి నటన తెలుగు సినిమాలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పాపుల‌ర్ నటులుగా స్థానాన్ని పదిలం చేసింది.

రాకింగ్ స్టార్ య‌ష్ ఇప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా స్టార్. కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 చిత్రాల‌తో అత‌డు సంచ‌ల‌నం సృష్టించాడు. ప‌ర్ఫెక్ట్ మాస్ యాక్ష‌న్ హీరోగా త‌న‌ని తాను య‌ష్ ఆవిష్క‌రించుకున్న తీరు ఆస‌క్తిక‌రం. 1970ల నాటి హిందీ సినిమాని గుర్తుకు తెచ్చే యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్ర రాఖీభాయ్ హిందీ ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. య‌ష్ లార్జ‌ర్ దేన్ లైఫ్ ఆన్-స్క్రీన్ పెర్ఫామెన్స్ భాషా అడ్డంకులను అధిగమించింది. దక్షిణాదిలోనే కాకుండా బెంగాల్ వెలుపల కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఉత్త‌రాదిన గొప్ప క్రేజ్ ఉన్న హీరో. అత‌డి సినిమాల కోసం కోల్ క‌త‌- బెంగాళ్ వ్యాప్తంగా ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

ద‌ళ‌ప‌తి విజయ్ ప్రాంతీయ సూపర్ స్టార్ మాత్రమే కాదు. దక్షిణాదితో పాటు ఉత్త‌రాదినా గొప్ప‌ అభిమానులను కలిగి ఉన్నాడు. కోల్‌కతాలో సర్కార్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఒక సంఘటన అత‌డికి ఎంత‌గా ఫాలోయింగ్ ఉందో వెల్ల‌డించింది. విజ‌య్ ఉత్త‌రాదిన గొప్ప క్రేజ్ తెచ్చుకున్నాడు. అతడి సినిమాలు సాధిస్తున్న వ‌సూళ్లే అపారమైన ప్రజాదరణకు సాక్ష్యం. బెంగాల్ నుంచి మెజారిటీ వాటా వ‌సూళ్ల‌ను అత‌డు సాధిస్తున్నాడు. దేశవ్యాప్తంగా మాస్ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వగల విజయ్ సామర్థ్యం అతడి ఆన్ స్క్రీన్ మాగ్నెటిక్ ప్రెజెన్స్ నటనా నైపుణ్యం ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే.

ప్ర‌భాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్, దళపతి విజయ్ ఇప్పుడు భార‌త‌దేశంలో గొప్ప పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. ప్రాంతీయ సరిహద్దులను దాటి ఉత్త‌రాది వ్యాప్తంగా, అలాగే పశ్చిమ బెంగాల్ అంతటా ప్రియమైన స్టార్లుగా మారారు. వారి ప్రతిభ, చరిష్మా.. లార్జ‌ర్ దేన్ లైఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాయాజాలంతో ప్రేక్షకులను ఏకం చేస్తూ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.