Begin typing your search above and press return to search.

కొంప‌ముంచిన ద‌ర్శ‌కురాలి కామెంట్?

మాట చాలా ప‌దునైన‌ది. అందుకే ఆచితూచి మాట్లాడాలి. నోటికి స్వేచ్ఛ ఉంద‌ని, ఏదో ఒక‌టి మాట్లాడేస్తే, దాని ప‌ర్య‌వ‌సానం తీవ్రంగానే ఉంటుంది

By:  Tupaki Desk   |   3 April 2024 3:30 AM GMT
కొంప‌ముంచిన ద‌ర్శ‌కురాలి కామెంట్?
X

మాట చాలా ప‌దునైన‌ది. అందుకే ఆచితూచి మాట్లాడాలి. నోటికి స్వేచ్ఛ ఉంద‌ని, ఏదో ఒక‌టి మాట్లాడేస్తే, దాని ప‌ర్య‌వ‌సానం తీవ్రంగానే ఉంటుంది. చాలా క‌ల‌త‌లకు కార‌ణం మాట్లాడే మాటే! ఇప్పుడు అలాంటి ఒక మాట‌.. ఇండ‌స్ట్రీలో ఒక బిగ్ డీల్ క్యాన్సిల్ కావ‌డానికి కార‌ణ‌మైంద‌నేది గుస‌గుస‌. పాపుల‌ర్ సౌత్ సూప‌ర్ స్టార్ న‌టించిన ఓ సినిమా ఇటీవ‌లే విడుద‌లై థియేట్రిక‌ల్ గా డిజాస్ట‌రైంది. ఈ సినిమాకి స‌ద‌రు స్టార్ హీరో కుమార్తెనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమా చాలా లోపాల కార‌ణంగా డిజాస్ట‌రైంది. క్రిటిక్స్ తీవ్రంగా విమ‌ర్శించారు. అయితే సినిమా ప‌రాజ‌యానికి చింతించిన స‌ద‌రు ద‌ర్శ‌కురాలు ఓ స‌మావేశంలో షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన బిగ్ బ్లండ‌ర్ గురించి ఓపెనైంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సుమారు 21 రోజుల ఫుటేజ్ ఎగిరిపోయింద‌ని, టెక్నిక‌ల్ గా జ‌రిగిన బిగ్ మిస్టేక్ తో చాలా మార్పులు చేయాల్సి వ‌చ్చింద‌ని ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టింది.

అంతా బాగానే ఉంది కానీ.. అప్ప‌టికే డిజాస్ట‌ర్ టాక్ మూట‌గ‌ట్టుకున్న స‌మ‌యంలో ఈ ర‌హ‌స్యాన్ని లీక్ చేయ‌డం వ‌ల్ల డైరెక్ట‌ర్ కి క‌లిసొచ్చిందేమీ లేక‌పోగా.. నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ లో దెబ్బ తినాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ అప్ప‌టికే ఓటీటీ డీల్ ని కుదుర్చుకున్నా ఆ వ్యాఖ్య‌ల కార‌ణంగా వెన‌క్కి త‌గ్గింద‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఆ సినిమాని మార్చి 8న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయాల్సి ఉండ‌గా, మార్చి 21 కి వాయిదా ప‌డింది. ఇప్పుడు ఈ తేదీ కూడా మిస్ కావ‌డంతో ఒక‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఫుటేజ్ మిస్సింగ్ స‌మాచారం అంద‌డంతో నెట్ ఫ్లిక్స్ ఈ డీల్ ని క్యాన్సిల్ చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు.