Begin typing your search above and press return to search.

2023 బాక్సాఫీస్: షారూఖ్ 2500 కోట్లు - ప్ర‌భాస్ 1000 కోట్లు

క్రిస్మ‌స్ రేస్ లో 'స‌లార్'తో పోటీప‌డుతూ షారూఖ్ డంకీ విడుద‌లైంది. ఈ సినిమా డీసెంట్ వ‌సూళ్ల‌ను సాధించి విజ‌యాన్ని అందుకుంది

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:49 AM GMT
2023 బాక్సాఫీస్: షారూఖ్ 2500 కోట్లు - ప్ర‌భాస్ 1000 కోట్లు
X

క్రిస్మ‌స్ రేస్ లో 'స‌లార్'తో పోటీప‌డుతూ షారూఖ్ డంకీ విడుద‌లైంది. ఈ సినిమా డీసెంట్ వ‌సూళ్ల‌ను సాధించి విజ‌యాన్ని అందుకుంది. అయితే షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ డుంకీ చిత్రాల‌తో చరిత్ర సృష్టించాడు. ఏకంగా రూ. 2500 కోట్లు వ‌సూలు చేసిన ఘ‌న‌త త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్ర‌భాస్ రెండు రిలీజ్ ల‌తో ఏకంగా 1000 కోట్లు వ‌సూలు చేసిన హీరోగా రికార్డుల‌కెక్కాడు. ఒకే ఏడాదిలో ఇద్ద‌రు అగ్ర హీరోలు క‌లిసి 3500 కోట్ల వ‌సూళ్ల‌ను తెచ్చారు.

2023 షారుఖ్‌కు చాలా ప్రత్యేకమైన సంవ‌త్స‌రం. బాలీవుడ్ బాద్ షా నాలుగేళ్ల డైల‌మా అనంత‌రం జనవరిలో పఠాన్‌తో అద్భుతమైన పునరాగమనం చేసాడు. ప‌ఠాన్ (సిద్ధార్థ్ ఆనంద్) ఏకంగా 1000 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఆపై జవాన్‌తో మ‌రోసారి ఖాన్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం ఏకంగా 1200 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఏడాది ముగింపులో రాజ్‌కుమార్ హిరాణీ డంకీతో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. డంకీ 300 కోట్లు వ‌సూలు చేసింది. ఈ మూడు సినిమాలూ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలవగా, ఆ సినిమాలు ఏకంగా రూ. 2500 కోట్లు రాబట్టినట్లు వెల్లడైంది.

ఇటీవల ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో షారుఖ్ ఖాన్ తన చిత్రాలతో ఒకే సంవత్సరంలో 2500 కోట్ల రూపాయల గ్రాస్ రాబడిని అందించిన మొదటి భారతీయ నటుడయ్యాడని తెలిపారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో రూ. 2,500 కోట్ల స్థూల ఆదాయాన్ని అందించిన మొదటి నటుడు అని బాలా ప్ర‌శంసించారు.

జనవరి 2023లో విడుదలైన పఠాన్ నాలుగు సంవత్సరాల తర్వాత షారూఖ్ ఖాన్ కంబ్యాక్ మూవీగా వచ్చింది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించాడు. పఠాన్ విజయం త‌ర్వాత‌ షారుఖ్ ఖాన్ జవాన్‌లో తన యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సెప్టెంబర్ 7న జ‌వాన్ కూడా 1000 కోట్ల క్ల‌బ్ చిత్రంగా రికార్డుల‌కెక్కింది. ఫుల్ ర‌న్ లో ఈ చిత్రం 1200 కోట్లు వ‌సూలు చేసింది. అట్లీ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో కాన్ స‌ర‌స‌న‌ నయనతార న‌టించ‌గా, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి, రిధి డోగ్రా కీలక పాత్రల్లో నటించారు. తాజాగా షారుఖ్ ఖాన్ డంకీలో న‌టించాడు. డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రంలో షారూఖ్‌తో పాటు బోమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ తదితరులు న‌టించారు. ఈ సినిమా 8రోజుల్లో 300 కోట్లు వ‌సూలు చేసింది. ఇది డీసెంట్ హిట్ గా నిలిచింది.

ప‌ఠాన్ తో 1000 కోట్లు, జ‌వాన్ తో 1200 కోట్లు, డంకీతో 300 కోట్లు కొల్ల‌గొట్టాడు బాద్ షా. అంటే మొత్తం 2500 కోట్లు ఒకే ఏడాదిలో వ‌సూలు చేసాడ‌న్న‌మాట‌. ఇది భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో నిజంగా సంచ‌ల‌నం. ప్ర‌భాస్ న‌టించిన రెండు సినిమాలు ఇదే సంవ‌త్స‌రంలో విడుద‌ల‌య్యాయి. ఇందులో స‌లార్ 550 కోట్లు వ‌సూలు చేసి ఇంకా థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గా, ఆదిపురుష్ ఇప్ప‌టికే రిలీజై 400 కోట్లు వ‌సూలు చేసింది. అంటే ప్ర‌భాస్ త‌న రెండు సినిమాల‌తో సుమారుగా 1000 కోట్లు ఈ సంవ‌త్స‌రంలో వ‌సూలు చేసాడు. షారూఖ్ - ప్ర‌భాస్ ఇద్ద‌రూ క‌లిసి 3500 కోట్లు బాక్సాఫీస్ వ‌ద్ద కొల్ల‌గొట్టారు.