Begin typing your search above and press return to search.

బడ్జెట్ పెరిగితే చాలు దానికి ఫిక్స్ అవుతున్నారు..!

కానీ సినిమాకు అవుతున్న బడ్జెట్ చూసి ఒక భాగంగా రిలీజ్ చేస్తే లాస్ అవుతుందని తెలుసుకుని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 May 2024 3:46 AM GMT
బడ్జెట్ పెరిగితే చాలు దానికి ఫిక్స్ అవుతున్నారు..!
X

స్టార్ సినిమాల రేంజ్ పెరగడంతో బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి అనుకున్న షూటింగ్ టైం కాస్త ఎక్కువ అవుతుంటే పెట్టిన ఖర్చు అంతా ఎలా వెనక్కి తీసుకు రావాలో అర్ధం కాక ఒక సినిమాగా చెప్పాలనుకున్న కథను రెండు భాగాలుగా చేసి ఆడియన్స్ మీదకు వదులుతున్నారు. ఈమధ్య తెలుగులో ఈ పంథా ఎక్కువైందని చెప్పొచ్చు. స్టార్ సినిమా స్టార్ డైరెక్టర్ కథ అనుకుని సెట్స్ మీదకు వెళ్లినప్పుడు ఒక సినిమాగానే చేయాలని అనుకుంటారు. కానీ సినిమాకు అవుతున్న బడ్జెట్ చూసి ఒక భాగంగా రిలీజ్ చేస్తే లాస్ అవుతుందని తెలుసుకుని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.

ఇలా చేసే సినిమాలకు ముందు ఫస్ట్ పార్ట్ అంచనాలను అందుకోవాలనే లాజిక్ మిస్ అవుతున్నారు. కొన్ని సినిమాలు ముందుగానే రెండు భాగాలని చెప్పి వదులుతుంటే కొన్నేమో సినిమా చివర్లో ట్విస్ట్ ఇస్తూ కథ కొనసాగుతుందని అంటున్నారు. పోని నిజమే రెండు సినిమాలుగా చెప్పే కథ నిజంగానే ఉందా అంటే అక్కడ అంత సీన్ ఏమి కనిపించట్లేదు. కేవలం షూటింగ్ రోజులు ఎక్కువ అవ్వడం పెరిగిన ఖర్చుని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక ఇలా సినిమాను ముక్కలు చేసి వదులుతున్నారు.

రీసెంట్ గా నాలుగేళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న ఒక పీరియాడికల్ మూవీని ఇంకా పూర్తి చేయలేదు. సినిమా డైరెక్టర్ దాని నుంచి తప్పుకుని వేరే ప్రాజెక్ట్ షురూ చేశాడు. స్టార్ హీరో చేస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే కోట్లు దారపోయడంతో చేసేదేమి లేక సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సినిమాను మొదలు పెట్టి షూటింగ్ కొంత భాగం చేసిన డైరెక్టర్ పర్యవేక్షణ అని పెట్టి నిర్మాత కొడుకుతోనే మిగతా సినిమా షూట్ చేస్తున్నారు.

సరే సినిమాను ఎలాగోలా పూర్తి చేసి వదులుతారు కదా అని ఫ్యాన్స్ అనుకుంటుంటే.. సినిమా మొదటి భాగం అంటూ రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వడంతో షాక్ అవుతున్నారు. బాహుబలి రేంజ్ లో నిజంగానే రెండు భాగాలుగా చెప్పే కథ ఉందా లేదా పెట్టిన ఖర్చుని రికవర్ చేసేందుకు ఇలా చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉని. టీజర్ అయితే పర్వాలేదు అనిపించేలా ఉన్నా ఆ హీరో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఎందుకో నెగిటివ్ ఇంపాక్ట్ తో ఉన్నారు. మరి ఫైనల్ గా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ ఒక్క సినిమానే కాదు బడ్జెట్ పెరిగిన ప్రతి సినిమా ఇలా రెండు భాగాలుగా వదులుదాం అనుకుంటే ప్రేక్షకులు కూడా అదే రేంజ్ ఫలితాన్ని అందిస్తారు.