Begin typing your search above and press return to search.

ముహూర్తాలు చూసుకుంటోన్న హీరోయిన్లు!

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేసాం. కొత్త క‌ల‌లు..ఆశ‌యాల‌తో ప్ర‌యాణం ముందుకు సాగించ‌డ‌మే ఆల‌స్యం

By:  Tupaki Desk   |   4 Jan 2024 5:30 PM GMT
ముహూర్తాలు చూసుకుంటోన్న హీరోయిన్లు!
X

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేసాం. కొత్త క‌ల‌లు..ఆశ‌యాల‌తో ప్ర‌యాణం ముందుకు సాగించ‌డ‌మే ఆల‌స్యం. అందులో అతి ముఖ్య‌మైన‌ది వివాహ బంధంతో ఒక‌ట‌వ్వ‌డం. గ‌తేడాది చాలా మంది సెల‌బ్రిటీ లు ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ నేప‌థ్యంలో 2024లోనూ ప‌లువురు భామా మ‌ణులు మూడు మూళ్లు వేయించుకోవ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీళ్లంతా మంచి ముహుర్తం కోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కొంత‌మంది భామ‌లైతే ముహూర్తం పెట్టేసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌కుల్ ప్రీత్ సింగ్.. త‌మ‌న్నా..అతిది రావు హైద‌రీ ఇప్ప‌టికే ప్రేమ‌లో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు..నిర్మాత జాకీ భ‌గ్నానీతో ర‌కుల్ డీప్ ల‌వ్ లో ఉంది. ఆ విష‌యాన్ని అధికారి కంగానూ ప్ర‌క‌టించారు. తాజాగా ఈ జంట ముహూర్తం చూసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 22న పెళ్లి తేదీగా నిశ్చ‌యించిన‌ట్లు బాలీవుడ్ లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఈ విష‌యాన్ని వారు ధృవీక‌రించాల్సి ఉంది. త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ కూడా ఇదే ఏడాది వివాహానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. త‌మ‌న్నా ఇంట్లో పెళ్లి ఒత్తిడి తీసుకురావ‌డంతో వాళ్ల మాట‌కు క‌ట్టుబ‌డి అమ్మ‌డు మూడు ముళ్ల‌కు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంట్లో పెళ్లి తేదీలు సెర్చ్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అతిది రావు హైద‌రీ- సిద్దార్ధ్ కూడా ఏడాది ప్ర‌ధ‌మార్ధంలోనే వివాహ బంధంతో ఒక‌ట‌వ్వాల‌ని చూస్తున్నారుట‌.

పెళ్లి ఆలోచ‌న వ‌స్తే మొద‌ట మీడియాకే చెబుతామ‌ని అధికారికంగానూ చెప్పేసారు. అలాగే మ‌ల‌యాళ హీరోయిన్ సంయుక్తా మీన‌న్ కూడా పెళ్లి కోసం ఎదురు చూస్తోందిట‌. ఈ నేప‌థ్యంలోనే అమ్మ‌డు కొత్త సినిమాలు ఒప్పుకోవ‌డం లేద‌ని వినిపిస్తుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'డెవిల్' లో సంయుక్త న‌టించిన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది అమ్మ‌డు పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం పెళ్లి కి సంబంధించిన వ్య‌వ‌హార‌మేన‌ని అంటున్నారు.

అలాగే శ్రుతి హాస‌న్ ఈసారి ఎలాంటి హింట్ ఇవ్వ‌కుండానే శంత‌ను హ‌జారికాతో స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేస్తోందిట‌. అది పెళ్లి అనే అంటున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రూ ప్రేమ‌లో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక సీనియ‌ర్ బ్యూటీలు త్రిష‌..అనుష్క కూడా స‌రైన కుర్రాడు దొరికితే చేసుకోవ‌డానికి సిద్దంగా ఉన్నారు.