Begin typing your search above and press return to search.

రివ్యూ చూశాకే మూవీ.. కంటెంట్ ఉంటేనే గానీ..

మూడు గంటల సినిమా చూసే ముందు.. ఒక్క అరగంట రివ్యూస్ కు కేటాయిస్తున్నారు అంతా. మెయిన్ గా మిడిల్ క్లాస్ లోని ఓ వర్గమంతా అదే ఫాలో అవుతోంది.

By:  Tupaki Desk   |   6 April 2025 5:00 AM IST
రివ్యూ చూశాకే మూవీ.. కంటెంట్ ఉంటేనే గానీ..
X

సినిమా.. ఓ మంచి ఎంటర్టైన్మెంట్ సాధనం. రోజూ తమ తమ పనులతో.. ఉద్యోగాలతో బిజీగా ఉంటున్నా.. స్ట్రైస్ రిలీఫ్ కోసం మూవీలనే ఎంచుకుంటారు. అందుకోసం స్పెషల్ ప్లాన్ కూడా వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే.. స్పెషల్ అకేషన్స్ కు, వీకెండ్ కు మూవీలనే ప్రిఫర్ చేస్తుంటారు.

అయితే కొంతకాలంగా సినిమాకు వెళ్లాలని ఫిక్స్ అవ్వడమే లేటు.. ముందుగా అందరూ చూసేది రివ్యూస్. ఫలానా మూవీ ఎలా ఉంది.. బాగుందా లేదా.. అన్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. కంపల్సరీగా రివ్యూ చూడకుండా ఫలానా సినిమాకు వెళ్లాలని ఎవరూ ఫిక్స్ అవ్వడం లేదని చెప్పాలి.

మూడు గంటల సినిమా చూసే ముందు.. ఒక్క అరగంట రివ్యూస్ కు కేటాయిస్తున్నారు అంతా. మెయిన్ గా మిడిల్ క్లాస్ లోని ఓ వర్గమంతా అదే ఫాలో అవుతోంది. సినిమా కోసం తెలుసుకోకుండా.. బ్లైండ్ గా అయితే సినిమాలను చూడడం మానేశారు. మూవీకి వెళ్లాలంటే.. కచ్చితంగా జెన్యూన్ సైట్స్ లో రివ్యూ చదవాల్సిందే.

కొందరు ఇంగ్లీష్ వెబ్ సైట్స్ లో కూడా చెక్ చేస్తున్నారు. అంతేగానీ సినిమా వెళ్లాక.. అర్రెర్రె వేస్ట్ మూవీకి వచ్చాం కదా అని బాధపడేలా ఉండకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదంతా థియేటర్లకే.. కాదు ఓటీటీ కంటెంట్ కు కూడా దాదాపు వర్తిస్తుంది. ఓటీటీలో స్ట్రీమ్ అయిన సినిమాలకు కూడా అదే జరుగుతుంది.

దీని బట్టి చూస్తే.. రివ్యూస్ పైనే మూవీ లవర్స్ ఫుల్ గా డిపెండ్ అవుతున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కంటెంట్ ఉందో లేదోనని రివ్యూ ద్వారా తెలుసుకుని సినిమాకు జై కొడుతున్నారు. అదే సమయంలో కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు.. తమ సినిమాల రివ్యూస్ పాజిటివ్ గా ఉండాలని, రాయాలని భావిస్తున్నారు!

అయితే కంటెంట్ బాగుంటేనే కదా రివ్యూ పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి కంటెంట్ ముఖ్యం. రివ్యూ పాజిటివ్ గా ఉండాలని అనుకునేవారు కంటెంట్ పై స్పెషల్ ఫోకస్ పెడితే చాలు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సక్సెస్ రేట్ బాగా తక్కువగా ఉంటుంది. కంటెంట్ మొత్తం బాగున్న సినిమాలు చాలా తక్కువ ఉంటున్నాయి.

కానీ ఆడియన్స్ స్క్రాప్ కోరుకోవడం లేదు. మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుని థియేటర్లకు వెళుతున్నారు. ఓటీటీల్లో కూడా చూస్తున్నారు. కాబట్టి మేకర్స్ కంటెంట్ పై దృష్టి పెట్టి మంచిగా ప్రెజెంట్ చేస్తే చాలు.. ఆటోమేటిక్ గా మూవీ సక్సెస్ అయిపోతుందంతే.