సినిమాలు ప్లాప్ అవ్వడం వెనుక రివ్యూవర్స్ ఉన్నారా..? వైరల్ న్యూస్...
ఇక దీన్ని గమనించిన కొందరు సినిమా ఫ్లాప్ అవ్వడానికి రివ్యూవర్లు ఇచ్చే రివ్యూలు కూడా కారణం అవుతున్నాయి అంటూ కొన్ని కథనాలైతే రాస్తున్నారు.
By: Tupaki Desk | 16 Sept 2026 8:45 AM ISTప్రతి 10 మందిలో ఏడుగురికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. సినిమా కోసం వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ గా ఉంటారు. వీకెండ్ వస్తే చాలు కొత్త సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల జీవితాల్లో కష్టం, సుఖం, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అన్ని సినిమానే అవుతుంది... అయితే ఈ రోజుల్లో సినిమాను థియేటర్ కి వెళ్ళి చూసే జనాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కారణమేంటంటే సినిమా రిలీజైన 20 రోజుల్లోనే ఓటిటి లోకి వస్తుంది. దానివల్ల ఫ్యామిలీ తో మూవీ కి వెళ్లి సినిమా చూసే కంటే ఓటిటి లో చూడటం బెటర్ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల కూడా ఆడియన్స్ థియేటర్ కి రాలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే రివ్యూవర్లు సినిమాలు రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమా మీద వాళ్ల అభిప్రాయాన్ని రివ్యూ రూపం లో వ్యక్తపరిచి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.
ఇక దీన్ని గమనించిన కొందరు సినిమా ఫ్లాప్ అవ్వడానికి రివ్యూవర్లు ఇచ్చే రివ్యూలు కూడా కారణం అవుతున్నాయి అంటూ కొన్ని కథనాలైతే రాస్తున్నారు. రివ్యూ అనేది ఒక్క పర్సన్ యొక్క అభిప్రాయం మాత్రమే దాన్ని అందరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం రివ్యూలు చెప్పడం వల్ల సినిమా టాక్ ఏంటి? ఎలా ఉంది అనేది జనానికి తెలిసిపోతుంది. దానివల్ల జెన్యూన్ గా టాక్ ను సంపాదించుకున్న సినిమాను ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
మొత్తానికైతే రివ్యూవర్స్ వల్ల ఈ సినిమా చూసి అనేది వాళ్ళు ముందుగానే డిసైడ్ అయిపోతున్నారు కాబట్టి ఒక సినిమా మీద పెట్టిన డబ్బులు వృధా అవ్వడం లేదని చెప్పే ప్రేక్షకులు ఉన్నారు. నిజానికి ఒక సక్సెస్ఫుల్ సినిమాకి ఎవరో ఒకరు నెగెటివ్ రివ్యూ ఇచ్చినంత మాత్రాన అది ప్లాప్ అవ్వదు. మౌత్ టాక్ తో ఆ సినిమా సక్సెస్ ని సాధిస్తుంది... అదే ఒక ప్లాప్ సినిమాకి ఎంత సక్సెస్ఫుల్ రివ్యూ ఇచ్చినా కూడా పబ్లిక్ ఇచ్చే నెగెటివ్ టాక్ ద్వారా ఆ సినిమా సక్సెస్ అయితే అందుకోలేదనే చెప్పాలి. మూవీ కంటెంట్ బావుంటే సినిమాలు ఆడుతాయి, దర్శకుడి ప్రతిభను బట్టి ఆయన సినిమాని ఎలా తీర్చిదిద్దాడు ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగాడా? లేదా అనేది మాత్రమే సినిమా సక్సెస్ కి కారణం అవుతుంది తప్ప రివ్యూవర్స్ వల్ల సినిమా రిజల్ట్ మారదు...
ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది, రివ్యూ లు ఇచ్చే వాళ్ళు పెరిగిపోయారు కాబట్టి సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అంటున్నారు. ఒకప్పుడు అసలు సోషల్ మీడియా లేదు, రివ్యూస్ రాసేవారు లేరు ఆ సమయంలో కూడా ప్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి కదా... మరి వాటి గురించి ఏం చెప్తారని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు...ఎవరు ఏం చెప్పిన కథలో దమ్ముంటే సినిమా ఆడుతుంది లేకపోతే ఆడదు ఫైనల్ గా జరిగేది ఇదే...
