నాగిని టాలీవుడ్ భవితవ్యం!
మౌనిరాయ్ అలియాస్ నాగిని టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం అవసరం లేని పేరు.
By: Tupaki Desk | 23 July 2025 3:00 PM ISTమౌనిరాయ్ అలియాస్ నాగిని టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం అవసరం లేని పేరు. బుల్లి తెర సీరియ ళ్లతో అమ్మడు ఎంతో ఫేమస్ అయింది. అందులోనూ నాగిని పాత్ర పోషించాలంటే మౌనీ రాయ్ మాత్రమే స్పెషలిస్ట్ అనిపించింది. హిందీ సీనియల్ డబ్బింగ్ నటి అయినా నాగిని వచ్చిన గుర్తింపు మాత్రం అసాధారణమైంది. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లో అవకాశాలు కూడా అందుకుంటుంది. తాజాగా 'విశ్వంభర' సినిమాకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అమ్మడు ఐటం పాటలో అలరించనుంది.
సత్యలోకంలో నాగిని చిరుతో స్టెప్ అందుకోబోతుంది. రగులుతోంది మొగలి పొద టైప్ లోనే పాట పీక్స్ లో ఉంటందనే ప్రచారం జరుగుతోంది. డాన్స్ పరంగా మౌనీరాయ్ స్పెషలిస్ట్. ఇండస్ట్రీకి రాకముందే అన్ని రకాల డాన్సులపై పట్టు సాధించింది. తనలో అన్ని రకాల అర్హతలు ఉండటంతోనే ఏరికోరి మరీ ఎంపిక చేసారు. అయితే ఈ సినిమా తర్వాత నాగిని టాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. టాలీవుడ్ లో తెలుగు ట్యాలెంట్ కంటే పక్క రాష్ట్రం వాళ్లకు...పొరుగింట వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
మన వాళ్లలో నేనిది వాళ్లలో ఏదో ఉందని పిలిచి మరీ ఛాన్సులిస్తుంటారు. ఈ నేపథ్యంలో మౌనీ రాయ్ భవితవ్యం టాలీవుడ్ లో ఎలా ఉంటుందో చూడాలి. టాలీవుడ్ లో సక్సెస్ అయితే కెరీర్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలంతా ఆమెతోనే ఐటం పాటలు కోరుకుంటారు. తెలుగింట పుల్ల కూర అంతా అలా ఫేమస్ అయిందే. అందులోనూ నాగిని స్పెషల్ సాంగ్స్ లో ఎక్స్ పర్ట్. 'రన్' అనే పంజాబీ చిత్రంలో రెండు దశాబ్దాల క్రితమే కుర్రకారును ఊపేసింది.
అటుపై 'కేజీఎఫ్', 'వేద' లాంటి చిత్రాల్లోనూ పెర్పార్మెన్స్ ఇచ్చింది. కానీ వాటితో పెద్దగా ఫేమస్ కాలేక పోయింది. ఒకటి కన్నడ చిత్రం కావడం..మరోటి హిందీ సినిమా కావడంతో ఆ రకంగా లైమ్ లైట్ లోకి రాలే కపోకపోయింది. కానీ తెలుగు సినిమాలో ఐటం పాట అంటే పీక్స్ లో ఉంటుంది. సక్సెస్ అయితే గుర్తింపు అదే స్థాయిలో ఉంటుంది.
