Begin typing your search above and press return to search.

ముఖం పెదాల‌కు స‌ర్జ‌రీ.. న‌టి తిర‌కాసు జ‌వాబు!

కొద్ది రోజులుగా మౌనిరాయ్ ముఖానికి శ‌స్త్ర చికిత్స చేయించుకుంద‌ని, పెద‌వుల‌ అందం పెంచుకునేందుకు ప్ర‌యోగాలు చేస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 April 2025 9:30 AM IST
ముఖం పెదాల‌కు స‌ర్జ‌రీ.. న‌టి తిర‌కాసు జ‌వాబు!
X

కొద్ది రోజులుగా మౌనిరాయ్ ముఖానికి శ‌స్త్ర చికిత్స చేయించుకుంద‌ని, పెద‌వుల‌ అందం పెంచుకునేందుకు ప్ర‌యోగాలు చేస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఆమె ముఖం బాగా ఉబ్బి, వాచి క‌నిపించే స‌రికి ఇలాంటి డౌట్లు పుట్టుకొచ్చాయి. త‌న ముఖంలో ఉబ్బుగా పుట్టుకొచ్చిన‌ మార్పులు, లిప్ ఫిల్లర్‌లను ప్రదర్శించే ఫోటోలు, వీడియోను షేర్ చేసిన తర్వాత మౌని కఠినమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. కొన్ని రోజుల తర్వాత BTFW 2025లో కనిపించిన సమయంలో మొదటిసారిగా ఈ ట్రోల్స్ గురించి మీడియా ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబిచ్చింది.

తన ముఖంలో తీవ్రమైన మార్పులకు సంబంధించిన ట్రోలింగ్‌పై మౌని రాయ్ స్పందించారు. ముఖ ఫీచర్ సర్జరీల కోసం తనను విమర్శించిన వారిపై ఎదురుదాడి చేసింది. జ‌నాల‌ అభిప్రాయాలు తనకు పట్టింపు లేదని పేర్కొంది. వైరల్ భయానీ షేర్ చేసిన వీడియోలో ఇలాంటి కఠినమైన వ్యాఖ్యలను ఎలా మేనేజ్ చేస్తారు? అని ప్ర‌శ్నించ‌గా..``అందరూ తమ పని తాము చేసుకోనివ్వండి… నేను అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోను. మీరు ఇతరులను ట్రోల్ చేయడానికి తెర వెనుక దాక్కుంటే.. మీరు దానిలో ఆనందాన్ని కనుగొంటే అలాగే ఉండండి`` అని సీరియ‌స్ అయింది.

మౌని రాయ్ ముఖ శస్త్రచికిత్స లో ఏదైనా తప్పు జరిగిందా? అని నెటిజ‌నులు ఆరా తీయ‌డంపైనా చాలా సీరియ‌స్ గా ఉంద‌ని త‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మైంది. మార్చి 31న మౌని రాయ్ ఇన్‌స్టాలో అందరి దృష్టిని ఆకర్షించిన రీల్‌ను పోస్ట్ చేశారు. `హిట్ ది బకెట్` ఆడియోతో ఉన్న‌ వీడియోలో మౌని బ్లాక్ గౌనులో కనిపించింది. కానీ ముఖంపై ఉబ్బు ఎత్తుగా కొన్ని లోపాలు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ర‌క‌ర‌కాల విధానాల్లో మౌని అందం మెరుగులు దిద్దుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంతా ఊహించారు. మౌని నుదిటిపై అసాధారణమైన వంకర టింక‌ర క‌నిపించ‌డంతో చాలామంది నుదిటి బొటాక్స్ చేయించుకున్నారని అనుమానించారు. మరికొందరు ఆమె పెదవులు ఉబ్బిపోయి మునుపటి ఫోటోల కంటే చాలా భిన్నంగా కనిపించడంతో పెదవుల‌కు బెట‌ర్ మెంట్ చికిత్స‌ జరిగి ఉండవచ్చని భావించారు.