Begin typing your search above and press return to search.

నాగినీతో మెగాస్టార్ ర‌గులుతోంది మొగ‌లిపొద‌!

`విశ్వంభ‌ర‌`లో బాలీవుడ్ న‌టి మౌనీరాయ్ అలియాస్ నాగినీ ఐటం పాట‌తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 July 2025 4:00 PM IST
నాగినీతో మెగాస్టార్ ర‌గులుతోంది మొగ‌లిపొద‌!
X

`విశ్వంభ‌ర‌`లో బాలీవుడ్ న‌టి మౌనీరాయ్ అలియాస్ నాగినీ ఐటం పాట‌తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు తెలుగు లోగిళ్ల‌లోనూ నాగినీగా ఎంతో ఫేమ‌స్. నాగిని గురించి ప్ర‌త్యేక ప‌రిచ యం అవ‌స‌రం లేని పేరు. హిందీ డ‌బ్బింగ్ సీరియ‌ళ్ల‌తో తెలుగు ఆడియ‌న్స్ కు రీచ్ అయింది. బాలీవుడ్ లోకొన్ని సినిమాలు కూడా చేసింది. దీంతో `విశ్వంభ‌ర` చిత్రంలో ఐటం భామ‌గా ద‌ర్శ‌కుడు మౌనీరాయ్ ని ఎంపిక చేసాడు.

మ‌రి మౌనీ రాయ్ ని ఎంపిక చేయ‌డాకి ఇంకా బ‌ల‌మైన కార‌ణాలు ఏవైనా ఉన్నాయా? అంటే కేవ‌లం ఐటం పాట కోస‌మే కాదు. క‌థ కూడా ఆమె పెర్పార్మ‌ర్ ని డిమాండ్ చేయ‌డంతోనే ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్. `యుముడికి మొగుడు`, `అంజి`లాంటి చిత్రాల త‌ర్వాత న‌టి స్తోన్న సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ ఇది. ఇందులోనూ అతీద్రీయ శ‌క్తులు హైలైట్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో నాగ లోకంలో నాగినీగా మౌనీ రాయ్ కనిపించ‌నుందిట‌.

ఆ సంద‌ర్భంలో ఈ పాట వ‌స్తుందిట‌. దీన్ని ఐటం పాట‌గా చెప్ప‌డం కంటే స‌న్నివేశంలో భాగంగా వ‌చ్చే పాట‌నే ఐటం పాట‌గా ప్రొజెక్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇందులో చిరంజీవి కూడా నాగ‌రాజ స్టెప్పులు అందుకుంటార‌ని స‌మాచారం. చిరంజీవి న‌టించిన `ఖైదీ` సినిమాలో `ర‌గులుతుంది మొగ‌లి పొద‌` ఎప్ప‌టికీ ఓ క్లాసిక్ ఐకానిక్ సాంగ్. అందులో చిరు-రాధ‌ల నాగ లోకం డాన్సు ఎంతో అద్భుతంగా ఉంటుంది.

అందులో కొన్ని స్టెప్పుల‌ను కూడా `విశ్వంభ‌ర‌`లో ఐటం పాట కోసం రీక్రియేట్ చేస్తున్నారుట‌. మొత్తానికిది మెగా అభిమానుల‌కు కిక్ ఇచ్చే అంశ‌మే. `ర‌గులుతుంది మొగ‌లి పొద` పాట‌లో చిరంజీవి-రాధ మ‌ధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంది. ఇద్ద‌రు గొప్ప డాన్సర్లు కావ‌డంతో అంత గొప్ప ఔట్ పుట్ వ‌చ్చింది. మ‌రి తాజా నాగినీ సాంగ్ ఆ రేంజ్ లో ఉంటుందా? అన్న‌ది చూడాలి. ఈ పాట కోస‌మే భీమ్స్ స్పెష‌ల్ గా రంగంలోకి దించిన సంగ‌తి తెలిసిందే.