ఏ మనిషి నీకు అర్హుడు కాడు.. పటానీకి మౌని విషెస్
మనల్ని మనలాగే అర్థం చేసుకునే ఒక మంచి ఫ్రెండు కావాలని అంటారు. అలాంటి ఒక మంచి ఫ్రెండును సంపాదించింది దిశా పటానీ.
By: Tupaki Desk | 16 Jun 2025 9:08 AM ISTమనల్ని మనలాగే అర్థం చేసుకునే ఒక మంచి ఫ్రెండు కావాలని అంటారు. అలాంటి ఒక మంచి ఫ్రెండును సంపాదించింది దిశా పటానీ. తనకు మౌని రాయ్ రూపంలో ఒక మంచి ఫ్రెండు సోదరి ఉంది. ఆ ఇద్దరు స్నేహితులు ఓ చోట కలిస్తే ఇక సందడి మామూలుగా ఉంటుందా? అది కూడా బర్త్ డే పార్టీలో కలిస్తే ఆ చిల్లింగే వేరుగా ఉంటుంది కదా!
జూన్ 13న దిశా పటానీ బర్త్ డే సందర్భంగా మౌని రాయ్ ఒక వీడియోను షేర్ చేసారు. ఈ చిన్న క్లిప్ లో ఫన్ వెటకారం ఎంతో ఆకట్టుకుంది. 24 సెకన్ల వీడియోలో మౌని తనదైన ప్రత్యేక పద్ధతిలో దిశాకు శుభాకాంక్షలు చెబుతూ పాడుతూ నవ్వుతూ కనిపించింది. ''పుట్టినరోజు శుభాకాంక్షలు దిశా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీకు చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్.. ఏ మనిషి నీకు అర్హుడు కాదు, ఎవరూ నీకు అర్హుడు కాదు, ఏ మనిషి నీకు అర్హుడు కాదు'' అని రాసింది. ఏ మనిషి నీకు అర్హుడు కాదు! అనే లైన్ మూడుసార్లు రిపీటెడ్ గా వినిపించింది. దిశాపై తన ప్రేమను అంతా మౌని ఈ రకంగా ప్రదర్శించింది.
మౌని - దిశా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరి మనసు ఒకరికి తెలుసు. ఒకరి సద్గుణాలు ఇంకొకరికి తెలుసు. అందువల్ల ఇంత డీప్ గా ఈ సందేశం పంపింది మౌని. సరదాగా జోకులు వేయడం, షికార్లలో ఫన్ ని ఎంజాయ్ చేయడం వారికి తెలుసు. జీవితంలో గమ్మత్తయిన విషయాలను కూడా ఇతరులకు చేరవేయడంలోను ఆ ఇద్దరూ ఎప్పుడూ ముందుంటారు. నిజమైన స్నేహంలో మాత్రమే ఇవన్నీ సాధ్యం. అన్నట్టు దిశా పటానీ గతంలో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత అలెక్స్ ఇలిక్ తో స్నేహం చేసింది. కానీ ఇప్పుడు ఎవరితో డేటింగ్ లో ఉందో ఇంకా క్లారిటీ లేదు. మరి ఎవరిని ఉద్ధేశించి మౌని ఇలా రాసింది?
