Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ నా సైజులు అడిగాడు

సినీ ఇండ‌స్ట్రీ అంద‌రూ అనుకున్నట్టు రంగుల ప్ర‌పంచం మాత్ర‌మే కాదు, ఇండ‌స్ట్రీలో ఉంటూ ఇబ్బంది ప‌డే వాళ్లు చాలా మందే ఉంటారు.

By:  Tupaki Desk   |   5 Jun 2025 3:27 PM
ఆ డైరెక్ట‌ర్ నా సైజులు అడిగాడు
X

సినీ ఇండ‌స్ట్రీ అంద‌రూ అనుకున్నట్టు రంగుల ప్ర‌పంచం మాత్ర‌మే కాదు, ఇండ‌స్ట్రీలో ఉంటూ ఇబ్బంది ప‌డే వాళ్లు చాలా మందే ఉంటారు. మ‌రీ ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ తో ఇబ్బంది ప‌డ్డామ‌ని ఇప్ప‌టికే చాలా మంది మీడియా ముందుకొచ్చి బాధ ప‌డిన సంద‌ర్భాలున్నాయి. ఇండ‌స్ట్రీ బ‌య‌ట‌కు క‌నిపించేంత అందంగా ఉండద‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు వారికి ఎదురైన పరిస్థితుల‌ను చెప్తూ ఉంటారు సెల‌బ్రిటీలు.

కొంత‌మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే, మ‌రికొంద‌రు ఛాన్సుల కోసం త‌మ‌ను వాడుకున్నార‌ని చెప్పిన సంద‌ర్భాలున్నాయి. అలాగే కొంద‌రు వ‌ర్క్ ప్లేస్ లో లైంగికంగా వేధిస్తూ ఉంటార‌ని ఇలా ఎన్నో అంశాలు గ‌తంలో వార్త‌ల్లోకి రాగా, తాజాగా ఓ ఇన్‌స్టా మోడ‌ల్ టాలీవుడ్ డైరెక్ట‌ర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ డైరెక్ట‌ర్ త‌న‌కు మూవీ ఛాన్స్ ఇచ్చి ఆ త‌ర్వాత త‌న‌తో అస‌భ్య‌కంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పుకొచ్చింది.

సోష‌ల్ మీడియాలో త‌న రీల్స్, వీడియోల‌తో పాపుల‌ర్ అయిన మౌనీషా చౌద‌రి వ‌చ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన క్రేజ్ ను చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాల్లోకి కూడా తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్ అవ‌కాశం ఇచ్చాడ‌ని, అవ‌కాశం ఇచ్చిన త‌ర్వాత త‌న‌తో ఆ డైరెక్ట‌ర్ అస‌భ్య‌క‌రంగా బిహేవ్ చేశాడ‌ని తెలిపింది.

ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ లోని ఓ డైరెక్ట‌ర్ త‌న‌కు ఫోన్ చేసి ఆయ‌న తీస్తున్న మూవీలో న‌టించ‌మ‌ని చెప్పాడ‌ని, ఛాన్స్ కూడా ఇస్తాన‌ని చెప్పాడ‌ని చెప్పింది. ఆ సినిమాలో న‌టించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పినా స‌రే విన‌కుండా త‌న తొడ‌ల కొల‌త‌లు అడిగి ఇబ్బంది పెట్టాడ‌ని, అస‌లు సినిమా ఛాన్స్ కు, దానికి సంబంధ‌మేంట‌ని మౌనీషా ప్ర‌శ్నించింది.

అయితే ప్ర‌స్తుతం ఆ డైరెక్ట‌ర్ స్టార్ అయిపోయి, పెద్ద పెద్ద యాక్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తున్నాడ‌ని చెప్పింది. అయితే ఇండ‌స్ట్రీలో తాను ఎదుర్కొన్న ప‌రిస్థితుల గురించి ఓపెన్ అయి మాట్లాడిన మౌనీషా చౌద‌రి ఆ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది మాత్రం పేరుని వెల్ల‌డించలేదు. మోడ‌ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌద‌రి ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటుంది.